ఓ మంచానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఇది మామూలు మంచం కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద మంచమని చెబుతున్నారు. పైగా ఈ మంచం తాళ్ల మంచం. ఈ మంచాన్ని ఎప్పుడో పూర్వం చూసి ఉంటారు. ఈ మంచానికి సంబంధించిన వీడియో అమృత్ సర్‌కి సంబంధించింది. ఈ మంచంపై 50 మంది కూర్చోవచ్చని, సులభంగా పది మంది పడుకోవచ్చని అంటున్నారు. ఎండాకాలంలో ఆరుబయట అలా మంచం మీద పడుకుంటే.. ఆ హాయే వేరు. ఇంతకీ ఈ మంచం ఎక్కడ ఉంది? ఈ మంచానికి సంబంధించిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ ఈ వైరల్ వీడియో.. Instagram పేజీ @amritsarislive నుండి పోస్ట్ చేయబడింది. ఇక ఈ వీడియో క్యాప్షన్‌లో ఏం రాశారంటే.. అమృత్ సర్‌లోని ఈ మంచం.. ప్రపంచంలోనే అతి పెద్ద మంచమని చెప్పాడు. ఈ మంచంపై 50 మంది కూర్చోవచ్చని, పది మంది ఈజీగా పడుకోవచ్చని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా ఈ మంచం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.
ఈ పోస్ట్‌కి ఇప్పటి వరకూ 33.3 మిలియన్ల వ్యూస్, 13 లక్షల లైకులు వచ్చాయి. అంతే కాకుండా ఈ వీడియోకు దాదాపు వెయ్యి మంది వరకూ కామెంట్స్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘బ్రదర్.. ఈ మంచంపై పది మందే కాదు.. ఊరంతా నిద్రపోవచ్చని’ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘బ్రదర్ హర్యానాలో ఇంకా పెద్ద మంచం ఉందని’ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంత వైరల్ అయిన వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి మరి.