Viral video: ఏందిరయ్యా ఇది.. మ్యాగీ నూడుల్స్ తో స్వెట్టర్ అల్లిన మహిళ.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..

| Edited By: Ravi Kiran

Jan 20, 2022 | 7:00 AM

ప్రస్తుతం ఉత్తరాదితో సహా యావత్ దేశమంతటా  తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి.   ఢిల్లీ,  ముంబై తదితర ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.  ఈక్రమంలో చాలామంది ఇంటికే

Viral video: ఏందిరయ్యా ఇది.. మ్యాగీ నూడుల్స్ తో స్వెట్టర్ అల్లిన మహిళ.. నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో..
Follow us on

ప్రస్తుతం ఉత్తరాదితో సహా యావత్ దేశమంతటా  తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి.   ఢిల్లీ,  ముంబై తదితర ప్రాంతాల్లో ఉష్ణో గ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.  ఈక్రమంలో చాలామంది ముసుగేసుకుని ఇంటికే పరిమితమవుతున్నారు.  ఒకవేళ బయటకు వచ్చినా   టోపీలు, మఫ్లర్లు, స్వెటర్లను ధరించిన తర్వాతే బయటకు అడుగుపెడుతున్నారు.  కాగా  చాలామంది మహిళలు ఇంట్లోనే స్వెట్టర్లు అల్లుతుంటారు. ఊలు సహాయంతో తమకు నచ్చిన విధంగా వాటిని డిజైన్ చేసుకుంటుంటారు. అయితే ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక మహిళ ఊలు బదులు మ్యాగీ నూడుల్స్ తో స్వెట్టర్ అల్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో  గిన్నెలో ఉడకబెట్టిన నూడల్స్ ను ఆరగించడానికి బదులు వాటిని ఉన్నిలా మార్చేసి స్వెట్టర్ తయారుచేసింది.  ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. @mixiaoz  అనే ట్విట్టర్ యూజర్ ఈ ఈ షాకింగ్ వీడియోను షేర్ చేయగా కొద్ది సేపట్లోనే వైరల్ గా  మారింది. ఇప్పటివరకు 7 మిలియన్ల మంది ఈ వైరల్ వీడియోను చూడడం విశేషం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.  ‘దయచేసి ఆహార పదార్థాలతో పరాచకాలొద్దు’ అని ఒకరు స్పందించగా ‘ఈ మహిళ సృజనాత్మకతకు సెల్యూట్ చేయాల్సిందే ‘ అని మరొక నెటిజన్ స్పందించాడు.  ‘మ్యాగీ నూడుల్స్ తో ఇలా ఎవరైనా చేయగలరా బ్రదర్’? అని ఇంకొకరు స్పందించారు.  మరి నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

Chips Packet: చిప్స్ ప్యాకెట్లలో గ్యాస్ ఎందుకు నింపుతారో మీకు తెలుసా? అసలు ఏ గ్యాస్ నింపుతారో తెలుసా?..

Raisins with Milk: ఈ పాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా.. రోజూ ఇలాగే తాగుతారు..!(వీడియో)