కొందరికి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే వెర్రి పట్టింది. ఆ వెర్రి ప్రమాదాల్లోకి నెడుతుంది. సభ్యత, సంస్కారం లేకుండాా ప్రవర్తించేలా చేస్తుంది. రీల్స్, షార్ట్ వీడియోస్ ద్వారా పాపులారిటీ పొందేందుకు.. కొంతమంది ఎన్ని కథలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. కొంతమంది యువతులు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మొన్నామధ్య.. బికినీలు ధరించి బస్సులో ప్రయాణించిన యువతుల వార్త వైరల్గా మారింది. తాజాగా ఓ యువతి లో దుస్తులు మాత్రమే ధరించి.. రద్దీ రోడ్డులో షో చేసింది. ఆమె ప్రవర్తన పట్ల నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఇకపై ఇలా ప్రవర్తించబోనని సదరు యువతి క్షమాపణలు కూడా చెప్పింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రీల్ కోసం ఓ యువతి డెనిమ్, బేర్ బ్రా ధరించి రద్దీగా ఉండే ప్రాంతంలో తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బహిరంగ ప్రదేశాల్లో ఆమె ఇలా ప్రవర్తించినందుకు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అలాగే బీజేపీ పార్టీ, బజరంగ్ దళ్, ఇతర సంస్థలు కూడా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతికూల వ్యాఖ్యలు, విమర్శలు రావడంతో యువతి పొగరు తగ్గింది.. ‘క్షమించండి.. పబ్లిక్ ప్లేస్లో అలాంటి బట్టలు వేసుకుని తిరగాల్సింది కాదు.. నా ప్రవర్తన మీ మనోభావాలను దెబ్బతీస్తే క్షమించండి. ఇకపై ఇలాంటి తప్పులు చేయను’ అంటూ క్షమాపణలు చెప్పింది.
#Indore: एक नया दौर? #viralgirl #meghdootchaupati #reelsvideo @abplive pic.twitter.com/HrfWRBEvwf
— Umesh Bhardwaj (ABP NEWS) (@umeshindore) September 25, 2024
इंदौर में लड़की ने पहले अश्लील कपड़े पहन बनाई रील..
◆ वीडियो वायरल होने के बाद माफी मांग रही युवती👏Indore | #MadhyaPradesh | #viralvideo | #इंदौर pic.twitter.com/c2VDjoWJKo
— manoj _Rodiya (@manoj23695) September 26, 2024
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..