Viral: మహిళ బయటికి వెళ్లగానే.. ప్లాట్‌లోకి చొరబడుతున్న యజమాని.. చివరికి ఏం జరిగిందంటే!

|

Jul 22, 2021 | 12:57 PM

ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు తాళం పెట్టడం మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమరపాటుగా ఉంటే.. దొంగలు ఉన్నదంతా ఊడ్చేస్తారు..

Viral: మహిళ బయటికి వెళ్లగానే.. ప్లాట్‌లోకి చొరబడుతున్న యజమాని.. చివరికి ఏం జరిగిందంటే!
Bizzare Incident
Follow us on

ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు తాళం పెట్టడం మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమరపాటుగా ఉంటే.. దొంగలు ఉన్నదంతా ఊడ్చేస్తారు. అయితే మీరు ఇంట్లో లేనప్పుడు.. ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి మీ గదిలోకి చొరబడితే..! సరిగ్గా ఇలంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ప్రతీరోజూ ఇంటి నుంచి బయటికి వెళ్లగానే.. ఆమె ఇంటి యజమాని.. సదరు మహిళ ఫ్లాట్‌లోకి ప్రవేశించి.. ఆమె మంచంపై పడుకోవడమే కాకుండా.. ఆ స్త్రీని రెచ్చగొట్టే విధంగా వింత పనులు చేసేవాడు.

మీరు అద్దెకు ఉంటున్నయితే.. మీరు లేనప్పుడు.. మీ ఇంటి పడకగదిలోకి యజమాని ఉద్దేశపూర్వకంగా వచ్చాడనికి తెలుసుకుంటే.. ఖచ్చితంగా మీకు కోపం వస్తుంది. ఇలాంటి అనుభవమే ఓ టీచర్‌కు జరిగింది. టైషా మాక్లియోడ్ అనే ఉపాధ్యాయురాలి పడకగాదిలోకి.. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని.. ప్రతీరోజూ సదరు మహిళ లేనప్పుడు ప్రవేశించి అసంబద్ధమైన చర్యలకు పాల్పడుతూ ఉండేవాడు. ఇక అతడిని ఒక సందర్భంలో ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

పడకగదిలోకి ప్రవేశించి వింతపనులు చేసేవాడట…

తన పడకగదిలో ఇంటి యజమాని చేసే వింత చేష్టలను తైషా సీసీ కెమెరాల ద్వారా రికార్డు చేసింది. ఆ యజమాని.. ఆమె మంచంపై పడుకోవడం.. దిండు, బెడ్‌షీట్‌‌ల వాసనను చూస్తూ పైశాచిక ఆనందాన్ని పొందటం తైషా రికార్డింగ్‌లో చూసి షాక్ అయింది. ఇక కొద్దిసేపటికి తర్వాత ఆ మంచాన్ని మొత్తం సరిచేసి అతడు ఏం చేయినట్లుగా బయటికి వచ్చేవాడు. ఈ వీడియో ద్వారా ఆమె తన ఇంటి యజమానిని ప్రశ్నించింది. పిల్లిని చూసేందుకే ఫ్లాట్‌లో వచ్చినట్లుగా అతడు బుకాయించాడు. అయితే తైషా అతడు చెప్పిన మాటలు నమ్మలేదు. వీడియోలు ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:

ఓర్నీ దుంపతెగ.! పులికి ఎదురెళ్లి ‘హలో బ్రదర్’ చెప్పాడు.. క్రేజీ వీడియో వైరల్..

వాహనదారులకు గుడ్ న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.! వివరాలివే..

ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. ఫ్యాన్స్‌‌ ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.!

బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే అదిరిపోయే బైకులు.. 84 కిలోమీటర్ల మైలేజ్.!