Viral: వాళ్లిద్దరూ శృంగారం చేసే సమయంలో కండోమ్‌కు హోల్స్.. కట్ చేస్తే.. 25 ఏళ్ల తర్వాత.!

|

Jul 04, 2023 | 6:26 PM

కొందరు పేరెంట్స్ ఒక బిడ్డతో తమ ఫ్యామిలీని కంప్లీట్ చేస్తుంటే.. మరికొందరు రెండు లేదా ముగ్గురు సంతానం ఉండాలని కోరుకుంటారు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే..

Viral: వాళ్లిద్దరూ శృంగారం చేసే సమయంలో కండోమ్‌కు హోల్స్.. కట్ చేస్తే.. 25 ఏళ్ల తర్వాత.!
Condoms
Follow us on

కొందరు పేరెంట్స్ ఒక బిడ్డతో తమ ఫ్యామిలీని కంప్లీట్ చేస్తుంటే.. మరికొందరు రెండు లేదా ముగ్గురు సంతానం ఉండాలని కోరుకుంటారు. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే.. కీలి రేబోర్న్ అనే యువతికి తనకొక చిట్టి చెల్లెలు ఉంటే బాగుంటుందనిపించింది. అందుకోసం ఏకంగా ఎవ్వరూ చేయలేని పని చేసింది. కట్ చేస్తే.. 25 ఏళ్ల అనంతరం ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకోవడంతో అందరూ దెబ్బకు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. టిక్ టాక్‌ వీడియో ద్వారా కీలి రేబోర్న్ అనే యువతి తన చెల్లెలు ఎలా పుట్టిందన్న విషయాన్ని వివరించింది. ఆమె పుట్టుకకు తాను ఓ కారణమని.. 25 ఏళ్లుగా దాచి ఉంచిన ఈ నిజాన్ని ఇప్పుడు బయటపెడుతున్నానని చెప్పింది. ‘నీ ఉనికికి నేనే బాధ్యురాలిని’ అంటూ ఈ వీడియోకు ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవైతే.. దయచేసి ఈ వీడియోలోని చివరి భాగాన్ని చూడవద్దు’ అని వీడియో ప్రారంభంలో తన చెల్లి సామ్‌ను హెచ్చరించింది రేబోర్న్.

‘ఇది చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అమ్మా! నన్ను క్షమించండి. సామ్ ఉనికికి నేను ఓ కారణం. నా చిన్నతనంలో నేను, నా స్నేహితురాలు ఓసారి మీ బెడ్‌రూమ్‌లోకి రహస్యంగా వెళ్లాం. ఆ సమయంలో నా స్నేహితురాలు నైట్‌స్టాండ్‌లో కండోమ్ ప్యాకెట్ చూసింది. అవి అక్కడ ఉంటాయని నాకు అస్సలు తెలియదు. వాటిని ఎందుకు ఉపయోగిస్తారు.? అవి ఏమిటో నా స్నేహితురాలు వివరించింది. అనంతరం ఆ పక్కనే ఓ చిన్న సూది ఉండటాన్ని గమనించింది. ఆ సమయంలో నా స్నేహితురాలు నాకు ఒక చెల్లెలిని ఇచ్చే ప్రయత్నంలో సూదితో కండోమ్‌లకు రంధ్రాలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్యాకెట్‌లోని కండోమ్‌లకు ఇద్దరం కలిసి హోల్స్ చేశాం’ అని రేబోర్న్ తన తప్పును ఒప్పుకుంది.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత తన తల్లి గర్భవతిని అయ్యాయని చెప్పిందని.. ఆ సమయంలో చాలా సంతోషపడ్డానని రేబోర్న్ వెల్లడించింది. ‘మా అమ్మ ఇప్పటికీ చెబుతూ ఉంటుంది.. అసలు ఇలా ఎలా జరిగిందో అర్ధం కావట్లేదు. మరో బిడ్డ పుట్టకుండా ఉండేందుకు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’ అని ఆమె తెలిపింది. కాగా, ఈ నిజాన్ని రేబోర్న్ బహిరంగంగా ఒప్పుకోవడంతో.. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.(Source)