AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!

భారతదేశంలో పండ్లు, కూరగాయల కోసం మార్కెట్‌కు లేదా సూపర్‌ మార్కెట్‌కి వెళ్లినప్పుడు మనం వాటిని చేతిలోకి తీసుకోవడం, వాటిని తాకి, నొక్కి చూసి, వాటిలో మనకు నచ్చినవి, తాజావి మాత్రమే తీసుకుంటాం.. కానీ మీరు ఈ అలవాటును అన్ని దేశాల్లోనూ పాటిస్తానంటే, ఇబ్బందుల్లో పడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక వార్త ప్రకారం.. అక్కడి సూపర్‌మార్కెట్‌లో కూరగాయలను, పండ్లను తాకి, ఆ తర్వాత వాటిని తిరిగి యధాస్థానంలో పెట్టడం అనైతికం. మీరు ఏదైనా వస్తువును తాకితే, దాన్ని తప్పనిసరిగా కొనాల్సిందే. లేదంటే, మీరు శిక్షాఅర్హులు అవుతారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే...

సూపర్‌మార్కెట్ వింత నియమం..కూరగాయలను ముట్టుకుంటే కొనాల్సిందే..లేదంటే చిత్తడే!
Japan Supermarket Rule
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2026 | 11:03 AM

Share

భారతదేశంలో మనం మార్కెట్‌కు లేదా సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు కూరగాయలు, పండ్లను చేత్తో పట్టుకుని, బాగా నొక్కి చూసి, అవి తాజాగా ఉన్నాయో లేదో పరీక్షించి కొనుగోలు చేయడం చాలా సాధారణమైన విషయం. ఒకవేళ నచ్చకపోతే వాటిని అక్కడే వదిలేసి వేరేవి వెతుకుతాం. కానీ, మీరు ఎప్పుడైనా జపాన్ దేశానికి వెళ్తే మాత్రం ఇలాంటి పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే జపాన్ సూపర్‌మార్కెట్లలో ఉండే ఒక కఠినమైన నియమం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. అక్కడ కూరగాయలను చేత్తో తాకితే, వాటిని ఖచ్చితంగా కొనుగోలు చేయాల్సిందే!

తాకితే కొనాల్సిందే – వైరల్ అవుతున్న జపాన్ రూల్:

జపాన్ వెళ్లిన ఒక భారతీయ పర్యాటకుడు అక్కడి షాపింగ్ సంస్కృతిని వివరిస్తూ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జపనీస్ సంస్కృతిలో పరిశుభ్రతకు (Hygiene) అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. జపాన్ సూపర్‌మార్కెట్లలోని పండ్లు, కూరగాయలు ఎంతో నాణ్యంగా, ప్యాక్ చేయబడి ఉంటాయి. అక్కడి నిబంధనల ప్రకారం, కస్టమర్లు తమకు అవసరమైన వస్తువులను కేవలం కళ్లతో చూసి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అనవసరంగా వాటిని తాకడం, నొక్కడం లేదా వాసన చూడటం వంటివి చేయకూడదు. ఒకవేళ మీరు ఏదైనా కూరగాయను లేదా పండును మీ చేతిలోకి తీసుకుంటే, దానిని తిరిగి షెల్ఫ్‌లో పెట్టడానికి వీల్లేదు. దానిని మీ షాపింగ్ బాస్కెట్‌లో వేసుకుని బిల్ చెల్లించాల్సిందే.

దీని వెనుక ఉన్న కారణం ఏంటి?:

జపనీయులు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఇబ్బంది కలగకూడదని భావిస్తారు. ఒకరు తాకిన కూరగాయలను మరొకరు కొనడానికి ఇష్టపడరు. పదే పదే చేతులతో తాకడం వల్ల క్రిములు (Bacteria) వ్యాపించే అవకాశం ఉందని, అలాగే పండ్లు లేదా కూరగాయలు నలిగిపోయి పాడవుతాయని వారు నమ్ముతారు. అంతేకాకుండా, జపాన్ దుకాణదారులు మార్కెట్‌కు తెచ్చే ముందే ప్రతి వస్తువును నాణ్యతా పరీక్షలు చేసి, పక్కాగా ప్యాక్ చేస్తారు. కాబట్టి వాటిని కస్టమర్లు మళ్లీ పరీక్షించాల్సిన అవసరం లేదని వారి నమ్మకం.

ఇవి కూడా చదవండి

భారతీయులకు ఎందుకు వింతగా ఉందంటే?:

మన దేశంలో కూరగాయల నాణ్యతను చేత్తో తాకి, గిల్లి లేదా నొక్కి చూడటం అనేది ఒక అలవాటు. అలాంటిది జపాన్ లోని ఈ నో టచ్ లేదా ముట్టుకుంటే కొనాలి అనే రూల్ భారతీయులకు ఎంతో షాకింగ్‌గా, వింతగా అనిపిస్తోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. మనవాళ్లు జపాన్ వెళ్తే షాపింగ్ చేయడం చాలా కష్టం అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, దేశం కాని దేశం వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలను, నియమాలను గౌరవించడం ఎంతో ముఖ్యం కదా!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!