AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడి కారులో వచ్చి చెప్పులు కుట్టే వ్యక్తి.. అతని సంపాదన, లైఫ్‌స్టైల్ చూస్తే షాక్ అవుతారు!

సాధారణంగా (మోచీ)చెప్పులు కుట్టే లేదా రిపేర్ చేసే వ్యక్తి అనగానే మనకు రోడ్డు పక్కన లేదా ఒక చిన్న గదిలో కూర్చుని పనిచేసేవారే గుర్తొస్తారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఈ మోచి దుకాణానికి వచ్చేది లగ్జరీ ఆడి కార్‌లో. అవును, మీరు విన్నది నిజమే! ఇంటర్‌నెట్‌ చేస్తున్న ఒక మోచి విలాసవంతమైన లైఫ్‌స్టైల్, అతని హైటెక్ షాపుకు సంబంధించిన విశేషాలు నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి. అతని గురించి తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే..

ఆడి కారులో వచ్చి చెప్పులు కుట్టే వ్యక్తి.. అతని సంపాదన, లైఫ్‌స్టైల్ చూస్తే షాక్ అవుతారు!
Luxury Shoe Repair
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2026 | 8:55 AM

Share

ఒక చెప్పుల దుకాణం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చెప్పుల దుకాణం మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మామూలుగా కనిపించే దుకాణం కాదు..ఇందులో ఎయిర్ కండిషన్డ్‌ సదుపాయాలు కలిగి ఉంటుంది. ఈ చెప్పుల దుకాణం అందించే వృత్తిపరమైన సేవ, విలాసవంతమైన జీవనశైలి ఈ వీడియోను పదే పదే చూడాలనిపించేలా చేస్తాయి. ఈ చెప్పుల దుకాణం దక్షిణ కొరియాలో ఉంది. వైరల్‌ వీడియో ప్రకారం..స్టార్ హోటల్ లాంటి ఏసీ దుకాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన ఒక ఇండియన్‌ టూరిస్ట్‌ ఈ ఆసక్తికరమైన వీడియోను రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం, సదరు మోచి ప్రతిరోజూ ఆడి కార్‌లో తన షాపునకు వస్తాడు. అతని దుకాణం కూడా సాధారణంగా లేదు. అది పూర్తి ఎయిర్ కండిషన్డ్ చేయబడి, ఆధునిక యంత్రాలు, విలాసవంతమైన ఇంటీరియర్స్‌తో ఒక ఫైవ్ స్టార్ హోటల్ క్యాబిన్‌ను తలపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్క చిన్న కుట్టుకు రూ.500 ఛార్జ్:

భారతదేశంలో చెప్పులు తెగిపోతే లేదా షూస్ కొద్దిగా పాడైతే రూ.20 నుండి రూ.50 లోపు రిపేర్ అయిపోతుంది. కానీ, ఈ సౌత్ కొరియా లగ్జరీ షాపులో ఒక చిన్న కుట్టు వేయడానికి భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.400 నుండి రూ.500 వరకు వసూలు చేస్తారు. అంత ధర ఉన్నప్పటికీ, అక్కడ కస్టమర్లు లైన్ కట్టి మరి ఎంతో ఓపికగా తమ వంతు కోసం వేచి చూస్తుండటం విశేషం.

ధరలు అంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటి?:

సౌత్ కొరియాలో లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ. అక్కడ ప్రతి వృత్తిని ఎంతో ప్రొఫెషనల్‌గా భావిస్తారు. దానికి తగిన గౌరవాన్ని, వేతనాన్ని అందిస్తారు. అత్యాధునిక పరికరాలు ఉపయోగించి, నాణ్యమైన సేవలను అందించడం వల్లనే అక్కడ అంత డిమాండ్ ఉంది.

కాగా, ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వృత్తి ఏదైనా సరే, అందులో చూపే ప్రొఫెషనలిజం చాలా గొప్పది అని ఒకరు కామెంట్ చేయగా.. మన దేశంలో రూ.50 లలో అయ్యే పనికి అక్కడ రూ.500 తీసుకుంటున్నారా! అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, ఈ లగ్జరీ మోచి దుకాణం మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!