Viral Video: ఏందయ్యా ఇది.. నడిరోడ్డుపైనే మహిళా కానిస్టేబుల్‌కు ముద్దిచ్చాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

|

May 29, 2023 | 12:36 PM

చట్టాలను అమలు చేయడం, నేరాలను నిరోధించడం, శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు అండగా నిలవడం.. ఇవన్నింటి బాధ్యత పోలీసులదే.

Viral Video: ఏందయ్యా ఇది.. నడిరోడ్డుపైనే మహిళా కానిస్టేబుల్‌కు ముద్దిచ్చాడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే?
Viral
Follow us on

చట్టాలను అమలు చేయడం, నేరాలను నిరోధించడం, శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు అండగా నిలవడం.. ఇవన్నింటి బాధ్యత పోలీసులదే. అయితే పోలీసులకు కూడా కొన్నిసార్లు ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. తాజాగా అలాంటి అనుభవమే ఓ మహిళా పోలీసుకు ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువకుడ్ని ఒక మహిళా కానిస్టేబుల్ ఏ విషయంపైనో అతడి చెంప నిమురుతూ ఓదారుస్తుంది. ఇక అదే అదునుగా తీసుకున్న ఆ యువకుడు ఆమెను కౌగలించుకుని.. ఒక్కసారిగా ముద్దు పెట్టేసుకున్నాడు. అయినా ఆమె కోపం తెచ్చుకోకుండా ఆశ్చర్యపోతూ.. నవ్వుతూ ఉండిపోయింది. ఇంతలో పక్కనే ఉన్న వ్యక్తులు సదరు యువకుడ్ని పక్కకు లాక్కుని వెళ్లారు.

కాగా, సదరు మహిళా పోలీసు బంగ్లాదేశ్ పోలీస్ యూనిఫాం ధరించి కనిపించడంతో ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..