Viral: దొరికింది పురాతన కుండ అనుకుంటున్నారా..? లోపల కళ్లు చెదిరేలా…

|

Oct 22, 2024 | 4:55 PM

మన దగ్గర తవ్వకాలు జరుపుతుండగా.. పురాతన నిధి, నిక్షేపాలు బయటపడిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అయితే పాశ్చాత్త దేశాల్లో కేవలం నిధి వేటనే తమ వృత్తిగా పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ ఆ పని లీగల్.. అయితే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Viral: దొరికింది పురాతన కుండ అనుకుంటున్నారా..? లోపల కళ్లు చెదిరేలా...
Pot With Treasure
Follow us on

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో, పురాతన కళాఖండాలు, చారిత్రక అవశేషాల కోసం పురావస్తు శాస్త్రవేత్తలు తరచుగా తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు బంగారు నాణేలు.. ఆభరణాలు, వజ్రాలు వంటివి లభ్యమవుతూ ఉంటాయి. మరికొన్ని సార్లు నాగరికతలకు సంబంధించిన ముఖ్యమైన అవశేషాలు బయటపడుతూ ఉంటాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కేవలం పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రమే సామాన్యులు కూడా.. పాత ఇళ్లు కూల్చేటప్పుడు, బావులు తవ్వించేటప్పుడు.. అనుకోకుండా పాతిపెట్టిన సంపద దొరుకుతూ ఉంటుంది. అయితే మన దేశంలో నిధులు వేట సాగించడం నేరం. కానీ కొన్ని పాశ్చాత్త దేశాల్లో మాత్రం.. ఈ తరహా ట్రజర్ హంట్ చేసేందుకు అనుమతి ఉంటుంది. వాళ్లు మెటల్ డిటెక్టర్స్ సాయంతో నిధి వేట కొనసాగిస్తూ ఉంటారు.

కాగా ఇటీవల, అటువంటి ఓ నిధి అన్వేషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ క్లిప్‌లో, భూమిని తవ్వుతున్న వ్యక్తి ఊహించని విధంగా పురాతన కుండను కనుగొన్నాడు. అతను దానిని జాగ్రత్తగా త్రవ్వి, అందులో దాగున్న విలువైన నిధిని చూసి తన్మయత్వానికి లోనయ్యాడు.

వీడియో దిగువన చూడండి… 

వీడియోలో, మీరు భూమి నుండి మట్టిని తొలగిస్తూ, శ్రద్ధగా పని చేస్తున్న వ్యక్తిని గమనించవచ్చు. అకస్మాత్తుగా, అతను పాతిపెట్టిన ఓ పురాతన కుండను గుర్తించాడు. ఆపై దాని చుట్టూరా ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించాడు. ఆ కుండ ఎన్నో ఏళ్ల క్రితం పాతి పెట్టినట్లు అనిపిస్తోంది. అతడు అత్యంత జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాడు. ఈ మొత్తం ప్రక్రియను, అతను తన హెల్మెట్‌పై అమర్చిన గోపురా కెమెరాలో బంధించాడు. కుండ పూర్తిగా వెలికితీసిన తర్వాత, అతను మట్టిని బ్రష్ చేసి, మూత తీశాడు. లోపల, అతను పురాతన నాణేలు, అనేక ఇతర కళాఖండాలను కనుగొన్నాడు. వీడియో షేర్ చేసిన హ్యాండిల్‌లో అలాంటి నిధి వేట వీడియోలు చాలా ఉన్నాయి.

చాలా మంది వినియోగదారులు వీడియో ప్రామాణికతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది స్క్రిప్టెడ్ అని.. ఫేక్ వీడియో అని కామెంట్స్ పెడుతున్నారు. TV9 Telugu కూడా, వైరల్ వీడియో ప్రామాణికతను నిర్ధారించడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..