Viral Video: యువతికి ముద్దు పెట్టబోయాడు.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు.. కట్ చేస్తే!

| Edited By: seoteam.veegam

Apr 27, 2023 | 2:01 PM

ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

Viral Video: యువతికి ముద్దు పెట్టబోయాడు.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు.. కట్ చేస్తే!
Viral Video
Follow us on

ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపిస్తాయి. ఇటీవల పోకిరిలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న యువతులను టార్గెట్‌గా చేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఎక్కడ జరిగిందో ఏంటో తెలియదు గానీ.. సీసీటీవీ కెమెరాలో మాత్రం రికార్డు అయింది. ఆ వీడియోలోని ఫైనల్ ట్విస్ట్ చూస్తే మీరూ కచ్చితంగా షాక్ అవుతారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ యువతి ఒంటరిగా రోడ్డుపై నడుచుకుని బస్టాప్ దగ్గరకు వస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఆమె వెనకే ఓ పోకిరి వెంటపడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ముద్దు పెట్టుకోబోయాడు.. ఎక్కదిపడితే అక్కడ చేతులు వేసి.. ఆమెను తోసేశాడు. ఇదంతా జరుగుతుండటంగా ఓ బస్సు అప్పుడే అక్కడికి వస్తుంది. అతడ్ని ఎవ్వరూ ఏం చేయలేదని అనుకోవద్దు. బస్సు పక్క నుంచి.. ఓ ముగ్గురు వ్యక్తులు పరుగున ఆ పోకిరి దగ్గరకు చేరుకుని.. తన్నులతో బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ఇప్పటివరకు 28 మిలియన్ల వ్యూస్ రాగా.. నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.