Viral Video: రీల్స్‌ పిచ్చి.. కాలేజీ ఫెర్‌వెల్‌లో కాస్త డిఫరెంట్‌గాట్రై చేశారు.. కట్‌ చేస్తే..

|

Jan 23, 2025 | 3:50 PM

ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఇలాంటి ప్రమాదకరమైన షూట్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగినా.. పిల్లలు మాత్రం లైట్ తీసుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు లైకులు, షేర్ల కోసం ఈనాటి పిల్లలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు..

Viral Video: రీల్స్‌ పిచ్చి.. కాలేజీ ఫెర్‌వెల్‌లో కాస్త డిఫరెంట్‌గాట్రై చేశారు.. కట్‌ చేస్తే..
Students Fall From Moving Thar
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసిన ప్రజలు రీల్స్ చేయడంలోనే బిజీగా ఉంటున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ రీల్స్‌ ఒక వ్యాధిలా మారిపోయింది. రీల్స్ కోసం కొందరు వింత వింత పనులు చేస్తుంటారు. మరికొందరు పిచ్చి పనులు చేస్తుంటారు.. ఆ క్రమంలో పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. లేదంటే ఇతరులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కాలేజీ ఫేర్‌వెల్‌ పార్టీలో ముగ్గురు విద్యార్థుల చేసిన స్టంట్‌ వారిని ఆస్పత్రి పాలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముగ్గురు విద్యార్థులు థార్‌ కార్‌ పైన కూర్చొని రోడ్డుపైకి వస్తున్న వీడియో మొదలవుతుంది. స్పిన్నింగ్ థార్ బ్రేక్ వేసిన వెంటనే, ఆ ముగ్గురు విద్యార్థులు ఒకరిపై ఒకరు పడతారు. విద్యార్థులు పడిపోతున్నప్పటికీ, ఆ వాహనం ముందుకు వెళ్తోంది. అంతలోనే తోటి విద్యార్థులు పరుగున అక్కడకు చేరుకుంటున్నారు. అదృష్టవశాత్తు కారు మరింత ముందుకు రాకుండా ఆగిపోవటంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్టైంది. అంతలోనే కిందపడిపోయిన విద్యార్థులు వెంటనే పైకి లేచి పక్కకు వెళ్లిపోయారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. ఇలాంటి ప్రమాదకరమైన షూట్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరిగినా.. పిల్లలు మాత్రం లైట్ తీసుకుంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు లైకులు, షేర్ల కోసం ఈనాటి పిల్లలు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నారంటూ మండిపడ్డారు.. సోషల్ మీడియా వినియోగదారులు కారు డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న ఇతర విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..