సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు నెటిజన్లు ఫిదా!

ఆధ్యాత్మిక గురువులు తమ ప్రవచనాలు, బోధనల ద్వారా గుర్తింపు పొందుతుంటారు. అయితే బృందావన్‌కు చెందిన ఓ గురువు తన యంగ్ లుక్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. ఆయనకు వచ్చిన ‘జెన్ జీ బాబా’ పేరు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. యవ్వనంగా కనిపించే రూపం, స్టైలిష్ లుక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 

సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు నెటిజన్లు ఫిదా!
Vrindavans Gen Z Baba Shashwat Acharya Takes Social Media By Storm

Updated on: Nov 01, 2026 | 6:04 PM

ఆధ్యాత్మిక గురువులు తమ ప్రవచనాలు, బోధనల ద్వారా గుర్తింపు పొందుతుంటారు. అయితే బృందావన్‌కు చెందిన ఓ గురువు తన యంగ్ లుక్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. ఆయనకు వచ్చిన ‘జెన్ జీ బాబా’ పేరు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. యవ్వనంగా కనిపించే రూపం, స్టైలిష్ లుక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఎవరీ శాశ్వత్ ఆచార్య?

 

సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో కొత్త వ్యక్తి వెలుగులోకి వస్తున్నారు. కొందరు తమ టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు ప్రత్యేక వ్యక్తిత్వంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా బృందావన్‌కు చెందిన శ్రీ శాశ్వత్ ఆచార్య ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యంగ్ భాగవత కథా వాచక్’గా పరిచయం చేసుకున్నారు. బృందావన్‌లోని శ్రీధామ్ గోదా విహార్ మందిర్‌కు పీఠాధీశ్వరుడిగా వ్యవహరిస్తున్నారు. భాగవత కథలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం ఆయన వృత్తి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే మతపరమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటుంటారు.

తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుండటంతో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అతని యూట్యూబ్ ఛానల్‌లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, వివిధ కోర్సులకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.

‘జెన్ జీ బాబా’గా ఎందుకు వైరల్?

సాధారణంగా ఆధ్యాత్మిక గురువులు ప్రవచనాలు, బోధనల ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందుతుంటారు. కానీ శాశ్వత్ ఆచార్య విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. యవ్వనంగా కనిపించే రూపం, స్టైలిష్ లుక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సరదాగా ‘జెన్ జీ బాబా’ అని పిలవడం ప్రారంభించారు. దీంతో ఆయన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురుస్తోంది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

శాశ్వత్ ఆచార్య ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆయనను చూసిన తర్వాత తమకు కూడా ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతోందంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.  చర్మ సౌందర్యం  రహస్యమేంటని సరదాగా ప్రశ్నిస్తున్నారు. ఆశీర్వాదాల కోసం వస్తూ ఆకర్షణకు అభిమానులుగా మారిపోతున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే యువ గురువు యంగ్ లుక్స్‌తో సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు. ఆయనకు వచ్చిన ‘జెన్ జీ బాబా’  పేరు ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us