
బెంగళూరుకు చెందిన మేఘా ఎక్స్‌లో తను కుక్ ను ఎందుకు పెట్టుకున్నానో వివరిస్తూ విషయాలను పంచుకున్నారు. బెంగళూరులో ఇద్దరు సభ్యులున్న కుటుంబానికి సాధారణంగా వంటవాళ్లు నెలకు రూ 7 వేల నుంచి రూ 8 వేల వరకు తీసుకుంటారనీ, రోజుకు రెండుసార్లు వస్తే ఆదివారం సెలవు తీసుకుంటారనీ తెలిపారు. కూరగాయలు కోసి, రెండు వంటకాలు త్వరగా తయారు చేసి.. వెంటనే మరో ఇంటికి వెళ్లిపోతారు. ఇలా ఒకే రోజు చాలా ఇళ్లలో వంట చేయాల్సి ఉండటంతో వేగంగా పని చేయడం వారికి తప్పనిసరి అవుతుందని ఆమె వివరించారు.
వంట త్వరగా పూర్తిచేయడానికి ప్రెషర్ కుక్కర్‌ను కుక్‌లు ఎక్కువగా ఉపయోగిస్తారని మేఘా అన్నారు. పప్పు, ఆలుగడ్డ, సోయా, చికెన్.. ఇలా ఏ వంటకమైనా చివరికి ప్రెషర్ కుక్కర్‌లోనే పండుతారని వ్యాఖ్యానించారు. వంట రుచి విషయానికి వస్తే మాత్రం రుచికరంగా ఏమీ ఉండదని చెప్పారు. మనకు ఎలా కావాలో పదే పదే చెబితే తప్ప రుచి మనకు నచ్చినట్లు ఉండదనీ, రుచిని పెంచేందుకు ఎక్కువ నూనె, ఎక్కువ మసాలాలు వాడతారనీ పోస్టులో తెలిపారు.
మేఘా చేసిన అసలు వ్యాఖ్యే నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంది. తాము నెలకు రూ. 8 వేలు రుచికరమైన భోజనం కోసం చెల్లించడం లేదని అన్నారు. రోజుకు రెండుసార్లు ఏం వండాలి? ఎలా వండాలి? అనే ఆలోచన, వంట పని నుంచి తప్పించుకోవడానికే డబ్బు చెల్లిస్తున్నామని వివరించారు. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.
Bengaluru cook economics are crazy actually.
For 2 people, around ₹7–8k/month, 2 visits a day, Sunday off.
They come in, chop vegetables , make 2 dishes quickly and move on to the next house.
Pressure cooker is basically their Astra , dal, aloo, soya, chicken… everything somehow ends up in it!
Taste is usually average unless you keep explaining how you want it. Otherwise more oil + more masala seems to be the shortcut.
And yet we continue.
Because I realised we’re not really paying ₹8k for amazing food.
We’re paying ₹8k to not have to think about cooking twice every single day.
— Megha (@HeyItsMegha) October 7, 2026
కొందరు నెటిజన్లు మేఘా అభిప్రాయంతో ఏకీభవించారు. కుక్ చేసే భోజనం అంత రుచిగా లేకపోయినా.. ప్రతి రోజూ స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా రెస్టారెంట్ ఫుడ్ తెప్పించుకోవడంతో పోలిస్తే అది చౌక అనీ, ఆరోగ్యకరమని అన్నారు. మరో నెటిజన్ బెంగళూరులో రూ.8 వేలు కుక్‌కు చెల్లించడం తక్కువేననీ చెన్నైలో రోజుకు ఒక్క సారి వచ్చి వంట చేయడానికే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు తీసుకుంటారని, ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి ఉన్న కుటుంబానికి ఇంకా ఎక్కువ అడుగుతారనీ అన్నారు. కుక్‌లు కొన్నిసార్లు కేవలం 20 నిమిషాల్లోనే వంట పూర్తి చేసి వెళ్లిపోతారని మరికొందరు కామెంట్ చేశారు.
మొత్తానికి, ‘కుక్‌కు మనం డబ్బులు రుచికరమైన భోజనం కోసం చెల్లిస్తున్నామా? లేక వంట చేయాలనే రోజువారీ బాధ్యత నుంచి బయటపడటానికా?’ అనే మేఘా వ్యాఖ్య సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.