Viral Video: మెషీన్‌లా చేతులను కదుపుతున్న చిన్నారి బాలుడు.. మార్షల్ ఆర్ట్స్ వేగం చూసి.. ‘లిటిల్ బ్రూస్ లీ’ అంటున్న నెటిజన్లు..

|

Jun 26, 2022 | 3:28 PM

బ్రూస్ లీ చిన్న వయసులోనే మరణించినా ఇప్పటికీ అతనిని ఇష్టపడేవారు.. అతనిలా ఉండాలని కోరుకునే వారు ప్రపంచంలో మిలియన్ల మంది ఉన్నారు. ఓ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video ) అవుతోంది.

Viral Video: మెషీన్‌లా చేతులను కదుపుతున్న చిన్నారి బాలుడు.. మార్షల్ ఆర్ట్స్ వేగం చూసి.. లిటిల్ బ్రూస్ లీ అంటున్న నెటిజన్లు..
Mini Bruce Lee Viral Video
Follow us on

Viral Video: మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉన్నవారు బ్రూస్ లీ పేరు వినే ఉంటారు. బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అని పిలుస్తారు . బ్రూస్ లీ కుంగ్ ఫూ(Kung fu )తో సరికొత్త ప్రయోగాలు చేశాడు. అంతేకాదు తన కొత్త యుద్ధ కళ సిఫు వాంగ్ తో  జాక్‌మన్‌ను కూడా ఓడించాడు. వాస్తవానికి..  కుంగ్ ఫూ మాస్టర్స్‌ను సిఫు అంటారు. కేవలం 11 సెకన్లలో డజన్ల కొద్దీ పంచ్‌లు కొట్టే సత్తా బ్రూస్‌లీకి ఉందని అంటున్నారు. బ్రూస్ లీ చేతులు ఎంత వేగంగా కదులుతాయో అవతలివారికి అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అతని మార్షల్ ఆర్ట్స్ చూస్తుంటే మనిషి కాదు యంత్రమా అనిపింస్తుంది. బ్రూస్ లీ చిన్న వయసులోనే మరణించినా ఇప్పటికీ అతనిని ఇష్టపడేవారు..  అతనిలా ఉండాలని కోరుకునే వారు ప్రపంచంలో మిలియన్ల మంది ఉన్నారు. ఓ చిన్నారి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో ఉన్న చిన్నారి బాలుడిని  ‘లిటిల్ బ్రూస్ లీ’ (‘Little Bruce Lee)అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఆ బాలుడి చేతులు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి, చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

చిన్నారి చేతులు మెషీన్‌లా ఎంత వేగంగా కదులుతున్నాయో వీడియోలో చూడొచ్చు.  అంతేకాదు ఆ బాలుడు  అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ కనిపిస్తున్నాడు.  ఈ చిన్నారి బ్రూస్‌లీ స్టైల్‌ని చూసేందుకు జనం పోటెత్తారు. అతని యుద్ధ కళల వేగాన్ని చూసి జనాలు ఆశ్చర్యతూ కళ్ళు విప్పారిచి మరీ చూస్తున్నారు. ఇంత చిన్న పిల్లవాడు బ్రూస్ లీ అంత వేగంతో మార్షల్ ఆర్ట్స్ చేయడం బహుశా ప్రజలు ఎప్పుడూ చూసి ఉండరు. అవును.. సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ చేసే చిన్నపిల్లలను చూసి ఉంటారు..  కానీ నిజ జీవితంలో అలాంటి పిల్లలను చూడటం చాలా అరుదు.

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @TheFigen అనే IDతో  షేర్ చేయబడింది. ‘లిటిల్ బ్రూస్ లీ’ అనే టైటిల్ ఇచ్చారు. 22 సెకన్ల వీడియో ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వ్యూస్ ను వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది. కొందరు చైల్డ్‌ని క్యూట్‌గా  అని ముద్దుగా పిలుస్తున్నారు.  మరికొందరు ‘నేను అతన్ని టాలెంట్ షోలో చూశాను’ అని కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..