Viral Video: రాత్రి డబ్బాలో 2 పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ ఓపెన్ చేసి చూడగా..

రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై ఒకదానితో మరొకటి పోట్లాడుకుంటున్న రెండు పాములను చూసి చలించిపోయిన ఓ వన్యప్రాణి ప్రేమికుడు వాటిని రక్షించి ఓ డబ్బాలో ఉంచాడు. అయితే, మరుసటి రోజు ఉదయం ఆ డబ్బాను తెరిచి చూడగా అతడికి ఊహించని షాక్ ఎదురైంది. రెండు పాముల్లో ఒకటి మరో పామును మింగేసి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: రాత్రి డబ్బాలో 2 పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ ఓపెన్ చేసి చూడగా..
Rajasthan Snake News

Updated on: Nov 02, 2026 | 9:32 AM

రోడ్డుపై కొట్లాడుతున్న రెండు పాములను ఓ వన్యప్రాణి ప్రేమికుడు రక్షించిన ఒ డబ్బాలో బందించగా వాటిలో ఓ పాము రోపామును మింగేసిన షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటా జిల్లా మందానా పట్టణంలో శనివారం సాయంత్రం రెండు కట్లపాములు రోడ్డుపై ఒకదానితో మరొకటి పెనవేసుకుని పోట్లాడటం ప్రారంభించాయి. వాటిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికంగా ఉన్న ఓ స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ రెండు పాములను జాగ్రత్తగా విడదీసి, సురక్షితంగా ఓ డబ్బాలో ఉంచాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఉదయం పాములను అడవిలో వదిలేందుకు స్నేక్ క్యాచర్ డబ్బాను తెరిచాడు. అయితే, అందులో ఒకే పాము కనిపించడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. మరో పాము ఏమైందోనని పరిశీలించగా, ఒక కట్లపాము మరో పామును మింగేసినట్లు గుర్తించాడు.

పాములను సురక్షితంగా రక్షించి డబ్బాలో ఉంచినప్పటికీ, వాటిలో ఒకటి మరోదానిని మింగేయడం ఈ ఘటనలో కలకలం రేపింది. డబ్బాలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని స్నేక్ క్యాచర్ భావిస్తున్నాడు. రెండు పాములను రక్షించిన తర్వాత చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us