Viral Video: ఓరి దీని ఏశాలో.. కుక్కను బకరా చేసిన బాతు.. ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చంతే..!

|

Jan 04, 2022 | 12:08 PM

Viral Video: కొన్ని కొన్ని మూగ జీవాల తెలివి పీక్స్‌లో ఉంటుంది. వాటి టైమింగ్ చూస్తే ముచ్చటగొలిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉందనుకున్న సమయంలో..

Viral Video: ఓరి దీని ఏశాలో.. కుక్కను బకరా చేసిన బాతు.. ఆస్కార్ అవార్డ్ ఇచ్చేయొచ్చంతే..!
Follow us on

Viral Video: కొన్ని కొన్ని మూగ జీవాల తెలివి పీక్స్‌లో ఉంటుంది. వాటి టైమింగ్ చూస్తే ముచ్చటగొలిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్రమాదం పొంచి ఉందనుకున్న సమయంలో అవి ప్రదర్శించే సమయస్ఫూర్తి మనుషులకూ ఆదర్శప్రాయంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. ఇందులో బాతు యాక్టీంగ్ చూస్తే.. ప్రపంచంలో ఏ నటి కూడా దాని ముందు బలాదూర్ అని చెప్పాల్సి వస్తుంది. అంతలా మైమరపించింది. అంతేందుకు ఆస్కార్ అవార్డు కూడా దాని నటనకు తక్కువే అని చెప్పాలి. ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియోలో ఓ ఇంటి పెరట్లో బాతు సంచరిస్తుండగా ఆ ఇంట్లో ఉన్న కుక్క గమనించింది. వెంటనే బాతు వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చింది కుక్క. అయితే, కుక్క రాకను పసిగట్టిన బాతు.. ఒక క్షణంలో తన బుర్రకు పదును పెట్టి ఊహించని పథకం వేసింది. తన చాణక్యాన్ని ప్రదర్శించింది. కుక్క తనను సమీపించే సమయానికి.. అది చనిపోయినట్లుగా పడుకుని ఉండిపోయింది. అది చూసి కుక్క షాక్ అయిపోయింది. నిజంగానే బాతు చనిపోయిందేమో అనుకుంది. అయినప్పటికీ ఎక్కడో చిన్న సందేహం మెదలడంతో.. కుక్క కాసేపు బాతును గమనిస్తూ నిలుచుంది. అయినప్పటికీ.. బాతులో ఏమాత్రం కదలిక లేదు. దాంతో నిజంగానే అది చనిపోయి ఉంటుందని నమ్మి.. అక్కడి వెళ్లిపోయింది కుక్క. ఇది గమనినంచిన బాతు టక్కున లేచి.. అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. ఇందంతా కెమెరాలో రికార్డవగా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా నెట్టింట్లో తెగ వైర్ అయ్యింది. ఆ వీడియోలో బాతు నటనను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్కను బకరా చేసిందంటూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇది కదా సమయస్ఫూర్తి అంటూ బాతు తెలివికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు. ఈ బాతును చూసి మనుషులు కూడా చాలా నేర్చుకోవాలంటున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Viral Video:

Also read:

ONGC Recruitment 2022: ఓఎన్జీసీలో భారీ వేతనాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చవరి తేదీ..

Telangana Corona Cases: కొంప ముంచిన న్యూ ఇయర్ వేడుకలు.. తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు..

India VS China : భారత్‌ వర్సెస్‌ చైనా వయా శ్రీలంక ప్లాన్‌ సిద్ధమవుతోందా?.. డ్రాగన్‌ చర్యలకు చెక్ పెట్టేనా?..