రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న కారు అలాగే మండుతూ రోడ్డుపై పరుగులు తీసింది. ఆ భయానక వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొట్టింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఈ వీడియోలో చూడవచ్చు. రోడ్డుపై కాలిపోతున్న ఈ కారు వీడియో సోషల్ మీడియాలో శరవేగంగా షేర్ అవుతోంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ లో చోటుచేసుకుంది. అజ్మీర్ కల్వర్టు దగ్గర కదులుతున్న కారులో మంటలు చెలరేగడం చూసి ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారంతా రోడ్డుపై పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.
జైపూర్‌లో జితేందర్ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా AC నుంచి పొగలు రావడం గమనించారు. వెంటనే కారును పక్కకు ఆపి బానెట్ తెరిచి పరిశీలించారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించాయి. దీంతో హ్యాండ్ బ్రేక్ దెబ్బతిని కారు ప్రధాన రహదారిపై నియంత్రణ లేకుండా ముందుకు కదిలింది. చివరకు డివైడర్ ను ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిసింది.
ఈ వీడియో చూడండి..
చివరకు రోలింగ్ కారు డివైడర్‌ను ఢీకొని దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కారులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..