Viral Video : ‘ఈ వర్షం సాక్షిగా’..అంటూ డ్యాన్ష్‌ చేస్తున్న ఏనుగు.. అందమైన వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే..

|

Jul 26, 2022 | 6:54 PM

ఏనుగులు..ఎక్కువగా నీరు, బురదలో ఆడటానికి ఇష్టపడతాయి. వాటి వెచ్చని స్వభావం కారణంగా, ఏనుగులు వర్షపు నీటితో అలసట తీర్చుకుంటాయి. వర్షం వస్తే

Viral Video : ఈ వర్షం సాక్షిగా..అంటూ డ్యాన్ష్‌ చేస్తున్న ఏనుగు.. అందమైన వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే..
Elephant
Follow us on

Viral Video : జంతువుల వీడియోలు, ఫోటోలను చూడటానికి ప్రజలు ఇష్టపడతారు. ఈ రకమైన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ సంఖ్యలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తాయి. జంతువులు, పక్షులు, చేపల వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. అటువంటి వీడియోలపై ఆసక్తికి అతిపెద్ద కారణం ఏమిటంటే, జంతువుల ప్రపంచం గురించి చాలా తక్కువగా తెలుసు. ప్రజలు అనేక జంతువులు, వాటి పిల్లల పట్ల ప్రేమను చూపిస్తుంటారు. ఇక అలాంటి వీడియోలు చూస్తూ ఎంజాయ్‌ చేసే జంతుప్రేమికులు చాలా మందే ఉంటారు.. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కొన్ని నవ్విస్తాయి, మరికొన్ని ఆలోచింపజేస్తాయి, ఇంకొన్ని ఏడిపిస్తుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది మరియు ఆనందపరుస్తుంది. వర్షంలో ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఓ గజరాజు వీడియో సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.

ఏనుగులు..ఎక్కువగా నీరు, బురదలో ఆడటానికి ఇష్టపడతాయి. వాటి వెచ్చని స్వభావం కారణంగా, ఏనుగులు వర్షపు నీటితో అలసట తీర్చుకుంటాయి. వర్షం వస్తే బురదలో ఆడుకోవడం, నదిలో ఈత కొట్టడం వాటికి ఇష్టం. మరి వర్షం పడే సూచనలు కూడా ఏనుగులకు తెలిసిపోయే సూచనలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వర్షాన్ని ఏనుగులను ఇష్టపడతాయా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, వర్షంలో ఏనుగులు చాలా సంతోషంగా ఉంటాయని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు. అయితే అందుకు ఉదాహరణగా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న వీడియో..

ఎలిఫెంట్ ఎయిడ్ ఇంటర్నేషనల్ షేర్ చేసిన వీడియో ఇది. వీడియోలో, ఒక ఏనుగు వాటర్‌హోల్ దగ్గర పడుకోవడం చూడవచ్చు. పైగా అక్కడ జోరు వర్షం పడుతోంది. ఏనుగు మెల్లగా లేచి ఆనందంతో డ్యాన్స్‌ చేస్తున్నట్టుగా స్టెప్పులు వేస్తుంది. అక్కడ ఆ ఏనుగులు చెరువులో నీటిని చిమ్ముతూ, బురదలో తిరుగుతూ ఆడుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏనుగు చాలా సంతోషంగా ఉందని వీడియో చూస్తే స్పష్టమవుతోంది. ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వీడియోకు 15000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి