Viral News: క్రేజీ ఎద్దు.. మూడంతస్తులు ఎక్కి.. బెడ్ రూమ్‌లో బెడ్‌పై సేదతీరింది

|

Jun 20, 2021 | 1:25 PM

ఓ ఎద్దు ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి వెళ్లి బెడ్‌రూంలోని బెడ్‌పై పడుకుని ఎంచక్కా సేదతీరింది.అయితే ఎద్దు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో గమనించని...

Viral News: క్రేజీ ఎద్దు.. మూడంతస్తులు ఎక్కి.. బెడ్ రూమ్‌లో బెడ్‌పై సేదతీరింది
Bull In Bedroom
Follow us on

ఓ ఎద్దు ఏకంగా మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి వెళ్లి బెడ్‌రూంలోని బెడ్‌పై పడుకుని ఎంచక్కా సేదతీరింది.అయితే ఎద్దు ఇంట్లోకి ప్రవేశించే సమయంలో గమనించని ఆ కుటుంబ సభ్యులు సడెన్‌గా బెడ్‌పై నిద్రపోతున్న ఎద్దును చూసి హడలిపోయారు. తర్వాత అక్కడి స్థానికుల సాయంతో దాన్ని కిందకు తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రీవాలో చోటుచేసుకుంది. సహజంగా సాధు జంతువులు ఇంట్లోకి రావడం మాములే.. కుక్కలు, పిల్లలు అయితే మన కాళ్ళ మధ్య తిరుగుతూ..మనం ఇక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఎన్ని ఫ్లోర్లు అయిన అలవోకగా ఎక్కగలవు. కానీ ఎద్దు లాంటి బారి జంతువు మూడు ఫ్లోర్లు మెట్లెక్కి ఇంట్లోకి రావడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు.

అయితే, ఆ ఎద్దు ఇరుకైన మెట్ల దారిలోనే మూడు ఫ్లోర్లు ఎక్కి వచ్చినప్పటికీ దానిని ఎవరూ గమనించలేదు.. తర్వాత ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోని వారంతా టీవీ చూస్తూ బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఎద్దు ఇంట్లోకి వచ్చేసి.. బెడ్‌రూంలోకి వెళ్లింది. అక్కడ ఉన్న అద్దంలో చూస్తూ.. నెమరు వేసుకుంటూ కాసేపు కునుకు తీసింది. కొద్దీ సేపటి తర్వాత దానిని గమనించిన ఆ ఇంట్లోని వారు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇలాంటి క్రేజీ ఎద్దును ఎప్పుడూ చూడ‌లేదంటూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

Also Read: సౌత్‌లో మాస్ట‌ర్ చెఫ్ హోస్ట్ చేయ‌బోతున్న స్టార్లు వీరే…

రూట్ మార్చేశారు.. తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న త‌మిళ హీరోలు