Viral Video: అది కడుపా..? చెరువా..? 15 సెకన్లలో 4 పెద్ద చేపల్ని మింగేసింది..
పక్షులు మాములుగా చిన్న చిన్న కీటకాలు, పురుగుల్ని తినడం మీరు చూసి ఉంటారు. ఇలా పెద్ద పెద్ద చేపల్ని తినడం మీరు ఎప్పుడైనా చూస్తే మీరు పక్కాగా నివ్వెరపోతారు. వీడియో చూసేద్దాం పదండి....
కొన్ని పక్షులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. ఒక్కో జాతి పక్షులకు ఒక్కో రకమైన ప్రత్యేకమైన శైలి ఉంటుంది. కొన్ని ఆహారం సంపాదించుకోవడంలో నేర్పరితనం ప్రదర్శిస్తున్నాయి. మరికొన్ని పక్షులు తమ గూళ్ల నిర్మాణంలో ప్రత్యేకతను చూపిస్తాయి. ఇంకొన్ని రకాల పక్షులు.. శత్రువుల బారి నుంచి తనను, తన పిల్లలను రక్షించుకోడానికి తెలివైన మార్గాలను ఎన్నుకుంటూ ఆశ్చర్యపరుస్తాయి. పక్షులు చిన్న, చిన్న పురుగులను, కీటకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. పెద్ద.. పెద్ద పక్షులు చేపల్ని, కుందేళ్లను కూడా అమాంతం మింగేస్తూ ఉంటాయి. తాజాగా మీ ముందుకు ఓ షాకింగ్ వీడియోను తీసుకొచ్చాం. ఇక్కడ ఓ పక్షి.. కేవలం 15 సెకన్ల వ్యవధిలో ఏకంగా 4 చేపల్ని అమాంతం మింగేసింది. వీడియో చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.
వీడియో దిగువన చూడండి…
This bird swallows 4 whole fish in less than 15 seconds pic.twitter.com/Du55HG9Ege
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 21, 2024
వైరల్ వీడియోలో ఒక పక్షి 15 సెకన్లలోనే గిన్నెలోని నాలుగు చేపలను మింగడం మీరు చూడవచ్చు. @AMAZlNGNATURE అనే అకౌంట్ నుంచి ట్విట్టర్(ఎక్స్)లో షేర్ చేసిన చిన్న క్లిప్ ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి గ్యాప్ లేకుండా మూడు చేపల్ని మింగేసింది ఆ పక్షి.. నాలుగో చేప మింగే ముందు మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంది. దాని వేగం, ఆహార సామర్థ్యం చూసి అందరూ నివ్వెరపోతున్నారు. సోషల్ మీడియా యూజర్స్ రకకరాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. “ఈ పక్షికి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి. ఇది జంతుల స్థాయిలో తినగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అది కడుపా, చెరువా.. మనిషి కూడా అన్ని చేపల్ని తినలేడు.. వామ్మో ఇదేం పక్షి అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..