AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16,500 అడుగుల ఎత్తైన గ్లేసియర్‌లో చిక్కుకున్న ఎలుగుబంటి పిల్ల..కట్‌ చేస్తే..ఎదురుగా తల్లి ఎలుగబంటి..?

జంతువులకు కూడా ప్రేమానురాగాలు, కృతజ్ఞతా భావం ఉంటాయని నిరూపించే ఒక అద్భుతమైన సంఘటన నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. సుమారు 16,500 అడుగుల ఎత్తైన అత్యంత ప్రమాదకరమైన గ్లేసియర్ లోయలో పడిపోయిన ఒక చిన్న ఎలుగుబంటి పిల్లను రెస్క్యూ బృందం చాకచక్యంగా రక్షించింది. పిల్లను కాపాడిన అనంతరం, దూరంగా చూస్తున్న దాని తల్లి ఎలుగుబంటి ఏం చేసిందో చూపించే ఈ అందమైన వీడియో నెటిజన్లు ఆకర్షిస్తోంది.

16,500 అడుగుల ఎత్తైన గ్లేసియర్‌లో చిక్కుకున్న ఎలుగుబంటి పిల్ల..కట్‌ చేస్తే..ఎదురుగా తల్లి ఎలుగబంటి..?
Bear Cub Rescue,
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2026 | 6:32 PM

Share

సెప్టెంబర్ 15న, సఫర్ హి మంజిల్ హై అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేయబడింది. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో, 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమానీనదంలోని పగులులో చిక్కుకున్న హిమాలయన్ బ్రౌన్ బేర్ కూనను రక్షించడం కనిపిస్తుంది. రెస్క్యూ టీ వివరాల ప్రకారం.. కూనను రక్షించడం అంత కష్టమైన పని కాదు. దాని తల్లి నుండి కూన ప్రాణాలను కాపాడటమే అసలైన సవాలు.

అసలేం జరిగింది?

ఎత్తైన మంచు పర్వత ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక చిన్న ఎలుగుబంటి పిల్ల ప్రమాదవశాత్తూ 16,500 అడుగుల ఎత్తులో ఉన్న మంచు బిలం లోకి జారిపడిపోయింది. లోతైన మంచు సందులో ఇరుక్కుపోవడంతో బయటకు రా లేక గడ్డకట్టే చలిలో కేకలు వేయడం ప్రారంభించింది. ఈ విషయాన్ని గమనించిన ప్రత్యేక రెస్క్యూ టీమ్ సభ్యులు వెంటనే స్పందించి ఆ పిల్లను రక్షించేందుకు సాహసవంతమైన చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

భయంతో కరిచేందుకు ప్రయత్నించినా..

రెస్క్యూ సభ్యులు లోతైన మంచు సందులోకి దిగి ఆ పిల్లను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రమైన భయంలో ఉన్న ఆ ఎలుగుబంటి పిల్ల, సహాయం చేయడానికి వచ్చిన వారిని చూసి భయపడి కరిచేందుకు ప్రయత్నించింది. నన్ను కరవకు, నిన్ను కాపాడటానికే వచ్చాం అని ఓదారుస్తూ రెస్క్యూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా, ఓర్పుగా దానిని సురక్షితంగా పైకి తీసుకువచ్చారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ, కొద్ది దూరంలో నిలబడి ఉన్న తల్లి ఎలుగుబంటి ఎంతో ఆందోళనతో గమనిస్తూ ఉంది. రెస్క్యూ టీమ్ సభ్యులు పిల్లను సురక్షితంగా బయటకు తీసి నేలపైకి వదిలిన వెంటనే, ఆ పిల్ల పరుగెత్తుకుంటూ తల్లి వద్దకు వెళ్ళింది.

ఆ సమయంలో జరిగిన దృశ్యం అక్కడున్న వారిని, సోషల్ మీడియా వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. తన పిల్లను కాపాడిన రెస్క్యూ బృందం వైపు చూస్తూ ఆ తల్లి ఎలుగుబంటి మనుషుల తరహాలోనే తన తలను వంచి కృతజ్ఞత తెలుపుతున్నట్లుగా నమస్కరించింది.

మనుషులకు, మృగాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని, తల్లి ప్రేమ గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. జంతువుల్లోని ఈ కృతజ్ఞతా భావాన్ని చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ