Viral Video: మద్యం ఇట్ల ముక్కు నుంచి కూడా తాగొచ్చా?.. చుక్క మిగుల్చకుండా మొత్తం తాగేశాడుగా..

రోడ్డు మీద మందుబాబులు చేసే చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఫుల్లుగా మందుకొట్టి సర్కస్‌ విన్యాసాలు చేస్తుంటారు. ఇక మద్యం బాటిల్‌ను మాత్రం అదేదో ప్రసాదం లెక్కనే పవిత్రంగా చూసుకుంటారు మందుబాబులు. ఇక తాగినాక చూడాలి వాళ్ల వేషాలు ఎలా ఉంటాయో. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌...

Viral Video: మద్యం ఇట్ల ముక్కు నుంచి కూడా తాగొచ్చా?.. చుక్క మిగుల్చకుండా మొత్తం తాగేశాడుగా..
Veriety Drinker

Updated on: May 22, 2025 | 6:16 PM

రోడ్డు మీద మందుబాబులు చేసే చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఫుల్లుగా మందుకొట్టి సర్కస్‌ విన్యాసాలు చేస్తుంటారు. ఇక మద్యం బాటిల్‌ను మాత్రం అదేదో ప్రసాదం లెక్కనే పవిత్రంగా చూసుకుంటారు మందుబాబులు. ఇక తాగినాక చూడాలి వాళ్ల వేషాలు ఎలా ఉంటాయో. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. అయితే ఇక్కడో వ్యక్తి మాత్రం మద్యం బాటిల్‌ను విచిత్రంగా తాగుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్‌గా మారింది.

ఓ పెద్దాయన క్వార్టర్ బాటిల్ కొనుక్కుని తాగే వీడియో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. మద్యం ఇలా కూడా తాగొచ్చా అని ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎవరైనా మందును గ్లాసులో పోసుకుని తాగుతారు. అయితే ఈ పెద్దాయన మాత్రం వెరైటీగా మద్యం తాగాడు. చుక్క మద్యం కూడా వృథా కాకూడదు అని అతని కాన్సెప్ట్‌ అనుకుంటా. విచిత్రంగా మందు తాగి అందరికీ షాకిచ్చాడు.

మద్యం తాగేందుకు గ్లాస్‌కు బదలుగా ఆస్పత్రిలో రోగులకు రక్తం ఎక్కించే సిరంజి పైపును బెస్ట్‌ ఆప్షన్‌ అనుకున్నట్టున్నాడు. వెంటనే సిరంజి పైపును ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు. అందులో ఓ చివరను తన ముక్కులో పెట్టుకుని, మరో వైపు భాగంలో మందు పోశాడు. తర్వాత దాన్ని చేత్తో పైకి ఎత్తి పట్టుకున్నాడు. అలా పైకి ఎత్తగానే అందులోని మందు మొత్తం పైపు గుండా ముక్కులోకి అటు నుంచి గొంతులోకి దిగింది. ఇలా విచిత్రమైన పద్ధతిలో మందు తాగుతున్న ఈ పెద్దాయనను చూసి అక్కడున్న వారంతా షాక్‌ అయ్యారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆ పెద్దాయన.. తన జీవితంలో చివరి పెగ్గు తాగుతున్నట్లు ఉంది అంటూ కొందరు కామెంట్స్‌ పెట్టారు. చుక్క మిగుల్చకుండా మొత్తం తాగేశాడుగా. అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.

 

వీడియో చూడండి: