Viral Video: పూలు పాతబడ్డాయి..ఇప్పుడు పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో డెకరేషన్‌.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధ లేదు!

సాధారణంగా పెళ్లి కారును రకరకాల పూలతో అలంకరిస్తారు, కానీ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలలో కొందరు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఈ వెరైటీ అలంకరణలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత అలంకరణలు చూసిన కొందరు బహుశా వరుడు కిరాణా షాపు యజమాని ఏమో అని జోకులు వేస్తు్న్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Viral Video: పూలు పాతబడ్డాయి..ఇప్పుడు పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో డెకరేషన్‌.. నవ్వి నవ్వి పోతే మాకు సంబంధ లేదు!
Wedding Car Decoration Ideas

Updated on: Apr 14, 2026 | 2:02 PM

పెళ్లిళ్లలో కొత్తదనం కోసం ఈ మధ్యకాలంలో వధూవరులు వింత వింత పనులు చేస్తున్నారు. గుర్రాలు, కార్లు దాటి హెలికాప్టర్లలో రావడం చూశాం. కానీ ఇప్పుడు పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. పూలతో అలంకరించే పాత పద్ధతికి స్వస్తి చెప్పి, పండ్లు, స్నాక్స్ ప్యాకెట్లతో కారును ముస్తాబు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక వైరల్ వీడియోలో వరుడి కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్ పండ్లు, ఆపిల్స్‌తో అలంకరించారు. కారు విండ్‌షీల్డ్, బాడీ అంతా పండ్లతో నిండిపోయింది. ఇది చూసిన ప్రయాణికులు మరియు స్థానికులు తమ ఫోన్లలో ఈ వింతను బంధించారు.

మరొక ఉదంతంలో, వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు. కారు బయట లోకల్ స్టోర్లలో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. దీనిపై స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి సంస్థలు కూడా ఎవరు చిప్స్ కావాలని అడిగారో ఇప్పుడు చెప్పండి? అంటూ ఫన్నీగా స్పందించాయి. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది.

ఇవి కూడా చదవండి

పెళ్లికి వచ్చే పిల్లలకు ఈ కారు ఒక విందులాంటిది అని ఒకరు కామెంట్ చేయగా, దూరం నుండి చూస్తే కారు బాగుంది కానీ, గమ్యం చేరేలోపు కోతులు ఆ పండ్లన్నీ తినేస్తాయి అని మరొకరు జోక్ చేశారు. అయితే కొంతమంది మాత్రం, ఇలా ఆహార పదార్థాలను అలంకరణ కోసం వాడి వృథా చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా, పెళ్లిని చిరస్మరణీయంగా మార్చుకోవడానికి నేటి యువత చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఫ్రూట్ డెకరేషన్ పెళ్లిళ్లలో కొత్త ఫ్యాషన్‌గా మారుతుందో లేదో వేచి చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us