Viral Photo: ఈ వంటిల్లులో ఫ్రిజ్ ఎక్కడుందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చండి.!

|

Sep 27, 2021 | 6:49 PM

Viral Photo: మీరూ తరచూ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటే.. ఫోటో పజిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం నెట్టింట ఇటువంటి పోస్టుల ట్రెండ్ కొనసాగుతోంది.

Viral Photo: ఈ వంటిల్లులో ఫ్రిజ్ ఎక్కడుందో గుర్తించండి.. ఈజీగా కనిపెట్టొచ్చండి.!
Fridge
Follow us on

మీరూ తరచూ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుంటే.. ఫోటో పజిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ప్రస్తుతం నెట్టింట ఇటువంటి పోస్టుల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి కావల్సినంత వినోదాన్ని, చురుకుదనాన్ని ఇస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామంది ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో ఆసక్తిని కనబరుస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ రిఫ్రిజిరేటర్ ఉంది. అదెక్కడుందో మీరు గుర్తించాలి. ఈ ఫోటో మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. చిత్రంలో అసలు ఫ్రిజ్ ఎక్కుడుందో తెలుసుకునేందుకు మీరు తీక్షణంగా చూడాల్సి వస్తుంది. భ్రమలోకి తీసుకెళ్లే ఈ ఫోటోలో ఫ్రిజ్‌ను చాలామంది ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటోపై ఓ లుక్కేయండి..

ఈ ఫోటోను ‘Unusual Images’ అనే ఫేస్‌బుక్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీనికి ‘ఫ్రిజ్ ఫర్ సేల్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి నెటిజన్లు క్యూ కట్టారు. సమాధానాలను కామెంట్స్ రూపంలో హోరెత్తిస్తున్నారు. ”ఒక్క క్షణం.! వాళ్లు జోక్ చేస్తున్నారని అనుకున్నా” అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా.. ”అందులో ఫ్రిజ్‌ను కనిపెట్టేందుకు నాకు చాలా టైం పట్టిందని” మరొకరు.. ”దాదాపు 20 సెకన్లు పట్టింది ఫ్రిజ్ కనిపెట్టడానికి” అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇప్పటికే ఈ ఫోటోను 7200 వేల మందికి పైగా లైక్ చేయగా.. 2300 రీ-షేర్స్ పొందింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరి చూద్దాం ఫ్రిజ్‌ను కనిపెట్టడానికి మీకు ఎంత సమయం పడుతుందో..?

Also Read:

పాకిస్తాన్ కరెన్సీని మీరెప్పుడైనా చూశారా? మన రూ. 2000 విలువ అక్కడెంతో తెలుసా?

కింగ్ కోబ్రా, రాకాసి బల్లి మధ్య భీకర పోరాటం.. చివరికి ఏం జరిగిందో చూస్తే షాకవుతారు.!

భార్యపై ప్రాంక్ వీడియో చేసిన భర్త.. వీడియో చూసి నెటిజన్లు ఆగ్రహం.. మీరూ ఓ లుక్కేయండి!

వైరల్ ఫోటోను క్రింద పోస్ట్‌లో చూడండి..