గజరాజు పోతుంటే..మొరిగిన శునకం..! ఎగిరితంతే ఏమైందో చూడండి..

జంతు ప్రపంచం నుండి అనేక వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంతువులకు సంబంధించిన చాలా దృశ్యాలు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటాయి. ఇక్కడ కూడా అలాంటి ఒక వీడియో నెటింట వైరల్‌గా మారింది. ఈ దృశ్యం ఏనుగు, కుక్క పోరాడుతున్న దృశ్యం. తనను చూసి మొరిగిన కుక్కకు ఏనుగు గుణపాఠం నేర్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బ నవ్వుతున్నారు. అదేంటో చూస్తే మీరు కూడా పగలబడి నవ్వుతారు. మాది గ్యారెంటీ..!

గజరాజు పోతుంటే..మొరిగిన శునకం..! ఎగిరితంతే ఏమైందో చూడండి..
Vastu Gifts To Avoid

Updated on: Jan 25, 2026 | 6:40 PM

రోడ్డుపై వెళ్తున్న గజరాజును చూసి శునకం నవ్విందట.. ఇది చాలా మంది చాలా సందర్భాల్లో వాడుకునే మాట.. ఎందుకంటే.. ఏనుగులు చూడటానికి సరదాగా ఉంటాయి. ఏనుగుల అల్లరి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ ఈ ఏనుగులు ఆగ్రహిస్తే మాత్రం వాటిని రూపం భయానకంగా మారుతుంది. కోపంలో ఉన్న ఏనుగులు విధ్వంసం సృష్టిస్తాయి. అవి చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. తనకు ఎదురు పడిన ఎవ్వరినీ విడిచిపెట్టవు.. ఇప్పుడు వైరల్ అయిన వీడియోలో ఏనుగు తనపై మొరిగిన కుక్కకు ఎలాంటి గుణపాఠం చెప్పిందో చూస్తే షాక్‌ అవుతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను లెక్ చైలెర్ట్ (lek_chailert) అనే ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోలో ఏనుగులు గుంపుగా ఉన్నాయి. అక్కడ ఒక తెల్ల కుక్క నిలబడి ఉంది. ఈ కుక్క ఏనుగును చూడగానే మొరగడం ప్రారంభిస్తుంది. కానీ, ఆ శునకాన్ని పట్టించుకోని గజరాజు మొదట్లో లైట్‌ తీసుకున్నాడు. కుక్కే కదా అని చూసి చూడనట్టుగా వెళ్లిపోతుంది ఆ ఏనుగు.. కానీ, ఆ కుక్క మాత్రం ఏనుగు మీదకు పదే పదే మొరుగుతూ ఎక్కువ చేసింది..దాంతో చిర్రెత్తి పోయిన ఏనుగు తన వెనుక కాలితో ఆ కుక్కను ఎగిరి తన్నేందుకు చూసింది..అయినా ఆగని కుక్క మళ్లీ అరుస్తోంది.. దాంతో ఇక లాభం లేదని గజరాజు తొండం ఎత్తేశాడు.. ఆ తరువాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పది లక్షలకు పైగా వీక్షణలను పొందింది. చాలా మంది నెటిజన్లు వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.