AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాసి పెట్టి ఉంది! ఒకే నంబర్‌తో 30 ఏళ్ల పోరాటం.. చివరకు రూ. 386 కోట్ల లాటరీ గెలిచిన దంపతులు

అదృష్టం ఎప్పుడు వరిస్తుందో ఎవరూ చెప్పలేరు అనడానికి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌ ఉదాహరణ. గత 30 ఏళ్లుగా ఒక్క డ్రా కూడా మిస్ కాకుండా లాటరీ ఆడుతున్న ఒక జంటను చివరకు భారీ జాక్‌పాట్ వరించింది. వారు ఏకంగా 41 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 390 కోట్లు) గెలుచుకున్నారు. ఈ భారీ విజయంతో వారి మూడు దశాబ్దాల కల నెరవేరింది. ఈ సొమ్ముతో తమ పిల్లలు, మనవరాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా, ప్రపంచ యాత్ర చేయాలని ఆ దంపతులు ఆనందంగా ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

రాసి పెట్టి ఉంది! ఒకే నంబర్‌తో 30 ఏళ్ల పోరాటం.. చివరకు రూ. 386 కోట్ల లాటరీ గెలిచిన దంపతులు
Lottery Jackpot Winner
Jyothi Gadda
|

Updated on: May 08, 2026 | 2:04 PM

Share

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. అమెరికాలోని వర్జీనియాకు చెందిన ఒక దంపతుల విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. గత రెండు దశాబ్దాలుగా వారు నమ్ముకున్న నంబర్లు వారిని ప్రపంచ స్థాయి కోటీశ్వరుల జాబితాలో చేర్చాయి. వర్జీనియాకు చెందిన మిల్టన్ మరియు మెలిండా అనే దంపతులు లాటరీ ఆడటాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నారు. అయితే, ఇక్కడ విశేషమేమిటంటే చాలామంది ప్రతిసారీ కొత్త నంబర్లను ఎంచుకుంటారు, కానీ ఈ జంట మాత్రం గత 20 ఏళ్లుగా ఒకే విధమైన నంబర్ సెట్‌ను వాడుతున్నారు. ఆ నంబర్ల మీద ఉన్న నమ్మకంతోనే ‘క్యాష్4లైఫ్’ (Cash4Life) అనే లాటరీలో పదే పదే ప్రయత్నించారు. చివరకు వారి పట్టుదలకు ఫలితం దక్కింది. ఆరు నంబర్లు సరిగ్గా సరిపోవడంతో వారు 41 మిలియన్ డాలర్ల భారీ బహుమతిని గెలుచుకున్నారు.

లాటరీ ఫలితాలు చూసి మొదట వారు నమ్మలేకపోయారు. ఆరు నంబర్లు మ్యాచ్ కావడాన్ని చూసి ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. సాధారణ మధ్యతరగతి జీవితం గడుపుతున్న ఈ కుటుంబానికి రూ. 386 కోట్లు రావడం అనేది ఒక తీపి కలలా అనిపించింది. వర్జీనియా లాటరీ అధికారులు ఈ జంటను ఆహ్వానించి భారీ చెక్కును అందజేశారు. ఈ భారీ సొమ్మును తాము ఏ విధంగా ఉపయోగించబోతున్నామనేది కూడా వారు వెల్లడించారు.

ముందుగా మాకున్న అప్పులన్నీ తీర్చేస్తాం. ఆ తర్వాత మా పిల్లల చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం కొంత మొత్తం పొదుపు చేస్తాం. మిగిలిన డబ్బుతో ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని అనుకుంటున్నాము అని మిల్టన్ ఆనందంగా తెలిపారు. పట్టువదలని విక్రమార్కుడిలా 20 ఏళ్ల పాటు ఒకే నంబర్‌ను నమ్ముకున్నందుకు తమకు దక్కిన అతిపెద్ద బహుమతి ఇదని వారు పేర్కొన్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదృష్టం అంటే వీరిదేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?