Viral Video: అబ్బో వీడి ఏశాలో.. షార్క్ తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్.. వీడియో చూస్తే షాక్..

|

Sep 12, 2022 | 9:05 AM

Trending Video: 7 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు.

Viral Video: అబ్బో వీడి ఏశాలో.. షార్క్ తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్.. వీడియో చూస్తే షాక్..
Shark Viral Video
Follow us on

భయంకరమైన జంతువులు భూమిపై నివసించినట్లుగానే.. నీటి లోపల కూడా కొన్ని నివసిస్తుంటాయి. ఇవి మానవులకు కూడా చాలా ప్రాణాంతకంగా మారతాయి. వీటిలో సొరచేపలు అగ్రస్థానంలో ఉంటాయి. సొరచేపలు సముద్రంలో ఎంతో వేగంగా, చాకచక్యంగా దాడి చేసే జీవులుగా పేరుగాంచాయి. ఇవి పదునైన పదునైన దంతాలతో పడవలను కూడా కొరుకుతాయి. అటువంటి పరిస్థితిలో, మనుషులు ఎప్పుడైనా వారి బారిలో చిక్కుకుంటే ఏం జరుగుతుందో ఇక చెప్పలేం. ఒక్కోసారి మనుషులను కూడా వీటిని వేటాడుతుంటారు. ఈ ఎపిసోడ్‌లో షార్క్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

సొరచేపలకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇప్పటికే చూసి ఉంటారు. అందులో అవి కొన్నిసార్లు మనుషులపై దాడి చేయడం, కొన్నిసార్లు చిన్న చేపలను వేటాడడం వంటివి కనిపిస్తుంటాయి. తరుచుగా సముద్రంలోకి వెళ్లేవారు సొరచేపల ప్రాంతాలకు వెళ్లడానికి భయపడుంటారు. అవి కనిపిస్తే, వాటికి దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ, ఈ వైరల్ వీడియోలో సీన్ మాత్రం చాలా వింతగా ఉంది. ఒక వ్యక్తి షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం వీడియోలో చూడొచ్చు. షార్క్‌లతో సహా పెద్ద అక్వేరియంలో చాలా చేపలు ఈత కొడుతున్నాయని వీడియోలో మీరు చూడవచ్చు. అదే అక్వేరియంలో, ఒక వ్యక్తి ప్రవేశించి, ఎలాంటి భయం లేకుండా షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

సొరచేపతో డ్యాన్స్ ఎలా ఉందో చూడండి..

ఈ వీడియో కూల్ వీడియోలు అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 7 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 47 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా షాక్ ఇచ్చే సీన్.. ఎందుకంటే సాధారణంగా షార్క్ ఎప్పుడు వేటాడుతుందో తెలియదు. అందుకే షార్క్ దగ్గరికి కూడా వెళ్లరు. అలాంటి రిస్క్ ఎవరూ తీసుకోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.