అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి.. కట్ చేస్తే.!

|

May 07, 2024 | 6:21 PM

సరీసృపాలలో అతిపెద్ద పాము అనకొండ. ఎంత బీభత్సంగా ఉంటుందో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. సినిమాల్లో చూసే మాదిరిగా.. నిజంగా కూడా అనకొండలు భారీగా ఉంటాయి. ఇక ఇంటర్నెట్‌లో అనకొండలకు సంబంధించి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ భారీ అనకొండకు..

అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి.. కట్ చేస్తే.!
Viral Video
Follow us on

సరీసృపాలలో అతిపెద్ద పాము అనకొండ. ఎంత బీభత్సంగా ఉంటుందో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. సినిమాల్లో చూసే మాదిరిగా.. నిజంగా కూడా అనకొండలు భారీగా ఉంటాయి. ఇక ఇంటర్నెట్‌లో అనకొండలకు సంబంధించి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ భారీ అనకొండకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కొందరు ఎంచక్కా ఈత కొడుతుంటే.. అనుకోని అతిధిలా భారీ అనకొండ వచ్చి వారిని పలకరిస్తుంది. ఇంతకీ చివరికి ఏం జరిగిందంటే..! ఫుల్‌గా తినేసి ఉన్నట్టుంది.. అందుకే ఈత కొడుతున్నవారిని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా.. అనకొండ ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకుంటుంది. ఆ తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఫుల్‌గా ఫుడ్ లాగించేసి ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘టైం చాలా బాగుంది బ్రదరూ’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘ఇలాంటి సాహసం ప్రాణాలకే ప్రమాదం’ అని ఇంకొకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.