Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..

|

Mar 14, 2022 | 1:42 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం.. షాకింగ్ గా అనిపిస్తాయి.

Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం.. షాకింగ్ గా అనిపిస్తాయి. ఇక మరికొన్ని మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇప్పుడు ఓ వీడియో నెట్టింట్లో తెగా హల్చల్ చేస్తుంది. ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బా నవ్వడం మాత్రం ఖాయమండోయ్.. ఇదేంటీ మ్యాటర్ చెప్పకుండా.. నవ్వేస్తారు అని చెబుతున్నా అనుకుంటున్నారు.. నిజమే.. దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అనే పదం వినే ఉంటారు.. కానీ అలాంటి మనుషులను చాలా తక్కువగా చూసుంటారు కదా.. టైం బాగలేకపోతే.. ఎక్కడున్నా.. ప్రమాదం పొంచి ఉంటుంది.. ఎంతగా తప్పించుకోవాలని ప్రయత్నించిన అంతకు మించి దరికి చేరుతుంది. ఈ వ్యక్తికి కూడా అదే జరిగింది. పాపం.. తన పోరపాట్లు లేకుండానే పొట్టు పొట్టుగా దెబ్బలు తిన్నాడు… అసలు విషయం ఎంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక కర్రను భూమిలో పాతడానికి ప్రయత్నిస్తుంటారు. ఓ వ్యక్తి పెద్ద సుత్తితో కొడుతుండగా…మరో వ్యక్తి క్రను పట్టుకుంటాడు. అయితే ఆ సుత్తి పొరపాటున కర్ర పట్టుకున్న వ్యక్తి చేయికి తగులుతుంది. దీంతో నొప్పితో ఆ వ్యక్తి విలవిలాడిపోతాడు.. ఆ తర్వాత.. దూరంగా ఉండి మరో కర్రతో ఆ కర్రను పట్టుకుని కూర్చుంటాడు.. అయితే ఈసారి ఆ సుత్తి దాని కర్ర నుంచి విడిపోయి ఏకంగా అదే వ్యక్తి తలపై పడుతుంది. ఇక చివరగా… కర్రకు దూరంగా.. పక్కనే ఉన్న చెట్టు పక్కన నిల్చోని చూస్తుంటాడు. అదే సమయంలో మరో వ్యక్తి కర్రను పాతేందుు సుత్తితో కొట్టగా.. కర్ర ఎగిరి అతని ముఖంపై పడుతుంది. పాపం ఎన్ని విధాలుగా ట్రై చేసిన అతని దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Ram Charan-Upasana: చిన్నపిల్లాడిగా మారిన చెర్రి.. లోకాన్ని మరిచి చిలిపి పనులతో అల్లరి చేసిన మెగా కపూల్..

Viral Photo: కురుల మాటున మోము దాచిన అందాల సీతాకోకచిలక.. స్టార్ హీరో తనయ.. ఎవరో గుర్తుపట్టండి..

Poonam Kaur: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ పూనమ్ కౌర్..

Bandla Ganesh: దేవర జెండాకి కర్రనౌతా.. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ రచ్చ..