‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్ ఎలప్పుడూ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తాయి. పేర్కొన్న ఫోటోలో ఏముంది.? ఉంటే అదెక్కడ ఉంది.? ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటిని సాల్వ్ చేయడంలో నెటిజన్లు ఆసక్తిని కనబరుస్తారు. సోషల్ మీడియాలో పిక్చర్ పజిల్స్ చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు పాత పజిల్స్ కూడా మరోసారి వైరల్ అవుతాయి. అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. మరి లేట్ ఎందుకు ఆ పజిల్‌పై లుక్కేద్దాం పదండి.!
ఏదో కొండ లాంటి ప్రాంతం.. చుట్టూ మంచు ఉన్నట్లు మీరు పైన ఫోటోలో చూడవచ్చు. అయితే అందులోనే ఓ చిరుత దాగుంది. చిరుత శరీరం.. ఆ ప్రాంతం ఒకే రంగులో ఉండటం వల్ల రెండు కలిసిపోయి.. అదెక్కడ ఉందో కనిపెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ ఇమేజ్ కాదు. పక్కా కెమెరాతో తీసిన ఫోటో ఇది. సౌరభ్ దేశాయ్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సుమారు మూడేళ్లు కష్టపడి హిమాలయ పర్వతాలపై మంచు చిరుతను తన కెమెరాతో బంధించాడు. చాలామంది నెటిజన్లు ఈ ఫోటోలోని మంచు చిరుతను కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే మొదటి ప్రయత్నంలోనే సఫలం అయ్యారు. మరి మీరు కూడా ఓ ట్రయిల్ వేస్తారా.? ఇది పాత ఫోటోనైనా మరోసారి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి మరి.! చిరుతను గుర్తించలేకపోయారా.. అయితే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.!
Also Read:
జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!
చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!
ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!
ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!