Viral Photo: బుర్ర హీటెక్కిపోద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ కెవ్వు కేక

పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్. మీ కోసం ఇప్పుడు క్రేజీ ఫోటో పజిల్...

Viral Photo: బుర్ర హీటెక్కిపోద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ కెవ్వు కేక
Find The Snake

Updated on: Jul 01, 2022 | 4:09 PM

spot the snake: ప్రజంట్ సోషల్ మీడియా(Social Media) ఏ రేంజ్‌లో జనాల్ని ప్రభావితం చేస్తుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏజ్‌తో పనిలేదు… అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా వేదికలపై ఇప్పుడు పజిల్స్(puzzles) బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ కనబరుస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని సాల్వ్ చేయకుండా వదిలిపెట్టరు. ఎంత టైమ్ పట్టినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా దానిపైనే కూర్చుని ఉంటారు. పజిల్స్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఐ పవర్ ఏ రేంజ్‌ ఉందో తెలుసుకునేందుకు కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే కాదండోయ్. ఇంట్రస్టింగ్ ఫోటో పజిల్స్ కూడా ఉంటాయి. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’, ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. ‘ఈ చిత్రంలో పామును కనిపెట్టండి’ లాంటి ఫోటో పజిల్స్ ఇప్పుడు  నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత ఈజీగా కాదు. సరదా తీరిపోతుంది. వీటిని సాల్వ్ చేయాలంటే మీ చూపుల్లో పవర్ ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని తికమక పెడతాయి. ఎంతసేపు ట్రై చేసినా వీడని చిక్కుముడిలాగే అనిపిస్తాయి. అయితే సదరు ఫోటోలో పరీక్ష పెట్టిన జంతువును లేదా వస్తువును కనిపెడితే.. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. తాజాగా  అలాంటిదో ఓ ఫోటో పజిల్ నెట్టింట సర్కులేట్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ పాము దాగుంది. దాన్ని కనిపెట్టడం పెద్ద కష్టం అయితే కాదండోయ్. ఎందుకంటే.. నూటికి 70 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మీరు కూడా ట్రై చేయండి. కష్టం అనిపిస్తే దిగువ ఫోటో చూసెయ్యండి.

Loading...
Unable to load recommendations.
Follow Us