Watch: ఏం మనుషులురా బాబు.. దేవుడు కూడా భరించలేని బాధ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆంజనేయస్వామి శిలా విగ్రహం!

|

Dec 09, 2024 | 11:01 AM

స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ మందిర్‌లో రికార్డ్ చేయబడిందని సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో నిజమా లేదా నకిలీదా అని తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజలలో తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఈ ఆలయానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.

Watch: ఏం మనుషులురా బాబు.. దేవుడు కూడా భరించలేని బాధ.. కన్నీళ్లు పెట్టుకున్న ఆంజనేయస్వామి శిలా విగ్రహం!
Hanuman Crying
Follow us on

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోలు చాలా వరకు ప్రజల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయి. వాటిలో కొన్ని మనల్ని షాక్‌కు గురిచేసేవిగా కూడా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వార్తల్లో నిలిచింది. ఇందులో ఆంజనేయమూర్తి ఏడుస్తున్నట్లుగా కనిపించిన దృశ్యం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో కాన్పూర్ మెట్రోపాలిస్‌లోని చకేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిలా నగర్‌కు చెందినదిగా తెలిసింది. ఈ వీడియో ఇక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీ మందిర్‌లో రికార్డ్ చేయబడిందని సమాచారం. వీడియో వైరల్ కావడంతో ఈ అద్భుతాన్ని చూడటానికి భక్తులు పోటెత్తారు. ఈ వీడియో నిజమా లేదా నకిలీదా అని తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రజలలో తారాస్థాయికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఈ ఆలయానికి చేరుకుని ఘటనను పరిశీలించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ వీడియో ఫేక్ అని అంటున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి స్వయంగా ఎడిట్ చేసి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో హనుమాన్ విగ్రహం ఏడుస్తున్నట్లుగా రికార్డ్‌ చేసి ప్రజల్ని ఆందోళనలోకి నెట్టేశారు. ఇది నిజం కాదని, నకిలీదని పోలీసులు కూడా చెప్పారు. కానీ, వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..