Scorpions in Water: వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు.. ఆస్పత్రి పాలవుతున్న వందల మంది..

|

Nov 17, 2021 | 9:45 PM

Scorpions in Flood Water: భారీ వర్షాలు, వరదలతో పాములు, కప్పలు, తేళ్లు తరచూ వీధుల్లోకి చేరతాయి. అప్పుడప్పుడు అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి.

Scorpions in Water: వామ్మో.. వరద నీటిలో ప్రాణాంతక తేళ్లు.. ఆస్పత్రి పాలవుతున్న వందల మంది..
Scorpions
Follow us on

Scorpions in Flood Water: భారీ వర్షాలు, వరదలతో పాములు, కప్పలు, తేళ్లు తరచూ వీధుల్లోకి చేరతాయి. అప్పుడప్పుడు అవి ఇళ్లలోకి కూడా వచ్చేస్తుంటాయి. ఈజిప్టులోని దక్షిణ నగరమైన అస్వాన్‌‌ను భారీ తుఫానులు ముంచెత్తాయి.. వరద నీరు వీధులు, ఇళ్లలోకి చేరింది..ఆ వరద నీటితో పాటు… ప్రమాదకరమైన తేళ్లు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి…ఈ తేలు కుట్టి ముగ్గురు మరణించగా, మరో 450 మంది చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ప్రాణాంతక తేళ్లు ఎక్కువగా పర్వతాలు, ఎడారులకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోనే సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని వైద్య కేంద్రాల్లో యాంటీ వీనమ్ అదనపు డోసులను సమకూర్చారు.

అయితే, ఈజిప్షియన్ కొవ్వు తోక గల ఇలాంటి ప్రాణాంతక తేళ్లు…ఈజిప్టులో ఎక్కువగా కనిపిస్తుంటాయని, ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన తేళ్లలో ఒకటి గా చెబుతున్నారు. అత్యంత విషం ఉన్నందున అది కుట్టగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాలు మెలితిప్పడం, అలాగే తల సంబంధిత సమస్యలు తలెత్తి మరణం సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జనం ఇళ్లలోనే ఉండాలని చెట్లు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం కోరింది.

Also read:

Viral Video: వధూవరుల కాస్ట్‌లీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. ఫన్నీగా స్పందిస్తోన్న నెటిజన్లు..

Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Kulbhushan Jadhav: కుల్‌భూషణ్‌ జాదవ్‌కు స్వల్ప ఊరట.. పాక్‌‌ను ఆదేశించిన ఇంటర్నేషనల్‌ కోర్టు