Viral Video: నీళ్లలో నడుస్తుండగా కాలికి రాయిలా ఏదో తగిలింది.. కట్ చేస్తే.. దెబ్బకు ఊహించని ట్విస్ట్

నదులు, సముద్రాల్లో అప్పుడప్పుడూ వింత, విచిత్ర జీవులు మనకు తారసపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కూడా. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: నీళ్లలో నడుస్తుండగా కాలికి రాయిలా ఏదో తగిలింది.. కట్ చేస్తే.. దెబ్బకు ఊహించని ట్విస్ట్
Viral Video

Updated on: Jun 24, 2024 | 5:53 PM

నదులు, సముద్రాల్లో అప్పుడప్పుడూ వింత, విచిత్ర జీవులు మనకు తారసపడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ సంఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కూడా. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నది నీటిలో నడుస్తున్న ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. నీటిలో రాయిలా మెరుస్తోందని కాళ్లతో తొక్కాడు.. కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో తెలుసా.?

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నది ఒడ్డున నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా అతడికి మార్గం మధ్యలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఓ రాయి లాంటి ఆకారంలా ఉంది అది. ఏమై ఉంటుందోనని దాన్ని తొక్కి చూశాడు. కాలు మోపగానే కొంచెం మెత్తగా  అనిపించింది. అదేంటో తెలియక మళ్లీ కాలితో గట్టిగా తొక్కాడు. అంతే.! ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. సదరు వ్యక్తి కాలిని గట్టిగా కొరకడంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. అతడిపై దాడి చేసింది స్టింగ్రే ఫిష్ అని తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ‘ఇది చాలా ప్రమాదకరం అని’ ఒకరు కామెంట్ చేస్తే.. ‘ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తిని ఇలాంటి చేపలే చంపేశాయి అని’ ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడ్డాయి. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us