AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు..! ప్రిన్సెస్‌కు దక్కిన అరుదైన అవకాశం?

న్యూయార్క్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ఒపెరా వేదికపై ప్రదర్శన ఇవ్వడం ఏ కళాకారుడికైనా ఒక పెద్ద కల. అయితే, ఈసారి ఆ వేదికపై ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒక నాటకంలో పాత్ర కోసం ఏకంగా పాములకు ఆడిషన్స్ నిర్వహించి ఒక భారీ పామును ఎంపిక చేశారు. ప్రదర్శన సమయంలో ఈ పాము వేదికపై ప్రధాన పాత్రతో కలిసి ప్రత్యక్షం కానుంది. దీనితో పాటు నాలా అనే మరో చిన్న పామును అండర్‌స్టడీగా ఎంపిక చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు..! ప్రిన్సెస్‌కు దక్కిన అరుదైన అవకాశం?
Snakes Audition For Opera Role
Jyothi Gadda
|

Updated on: Sep 07, 2026 | 8:28 PM

Share

న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మెట్రోపాలిటన్ ఒపెరా నాటకంలో నటించడం కోసం మనుషులే కాకుండా ఏకంగా పాములు కూడా బాహాటంగా విజయం సాధించడానికి పోటీ పడ్డాయి..! ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు వోల్ఫ్‌గ్యాంగ్ అమడేయస్ మోజార్ట్ రాసిన Così fan tutte అనే క్లాసిక్ ఒపెరాను 1950ల కాలం నాటి కోనీ ఐలాండ్ కార్నివాల్ థీమ్‌తో ప్రదర్శిస్తున్నారు. ఈ కథలో కార్నివాల్ వాతావరణాన్ని ప్రతిబింబించేందుకు ఒక స్నేక్ చార్మర్ పాత్ర,దానికి తోడుగా నిజమైన పాము అవసరమైంది.

పాములకు ఆడిషన్లు ఎలా నిర్వహించారు?

ఈ నాటకంలో స్నేక్ హ్యాండ్లర్‌గా నటిస్తున్న జోయి జిగ్‌ఫెల్డ్ స్వయంగా ఈ ఆడిషన్లను పర్యవేక్షించారు. ఆడిషన్‌కు వచ్చిన ప్రతి పామును చేతుల్లోకి తీసుకుని, తన శరీరంపై పాకేలా చేస్తూ, తలపైకి ఎత్తి పట్టుకుని లైట్ల వెలుగులో వాటి ప్రవర్తనను పరిశీలించారు. పాము పెద్దగా ఉంటే సరిపోదు, వేదికపై ఉండే వెలుగులు, ప్రేక్షకుల కోలాహలానికి భయపడకుండా మనుషులతో సజావుగా ఉండగలదా లేదా అన్నది ప్రధానంగా పరిశీలించారు.

అనేక పాములను పరిశీలించిన తర్వాత ప్రిన్సెస్ అనే పసుపు-నారింజ వర్ణంలో ఉన్న బోవా కాన్స్ట్రిక్టర్ పామును ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. ఇది చూడటానికి పెద్దదిగా, వేదికపై ఆకట్టుకునేలా ఉండటంతో పాటు ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంది. ఒకవేళ ప్రదర్శన సమయంలో ప్రిన్సెస్ ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ప్రత్యామ్నాయంగా వాడటానికి నాలా అనే మరొక చిన్న గోధుమ రంగు పామును అండర్‌స్టడీ అంటే బ్యాకప్‌గా సిద్ధంగా ఉంచారు.

ఇవి కూడా చదవండి

జోయి జిగ్‌ఫెల్డ్‌కు గతంలో కోనీ ఐలాండ్‌లో రోజుకు 8 సార్లు పాములతో ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉంది. ఈ భారీ పామును నాటకం పూర్తయ్యే వరకు వేదికపై బ్యాలెన్స్ చేయడం తన బలానికి కూడా ఒక పరీక్ష అని ఆయన సరదాగా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రిన్సెస్ ప్రాక్టీస్ రిహార్సల్స్‌లో పాల్గొంటోంది. వినూత్నంగా సాగిన ఈ పాముల ఆడిషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
నాటకంలో రోల్ కోసం పోటీ పడిన పాములు! ప్రిన్సెస్‌కు దక్కిన అవకాశం?
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
షియోమీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌.. 21 రోజుల బ్యాటరీ లైఫ్..
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
పిచ్చెక్కించే ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. సీక్రెట్‌ ఏంటి
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
ఏపీలో అమానుషం.. చేతులు, మెడకు తాళ్లతో కట్టి వీధుల్లో అర్ధనగ్నంగా
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
స్మార్ట్‌వాచ్‌లోని హెల్త్ రీడింగ్స్‌ కరెక్టేనా..?
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
పెళ్లి తర్వాత అదృష్టం కలిసొచ్చే రాశులివే.. మీ రాశి ఉందా మరి !
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
దొంగల భయం.. కొత్తకారును ఎక్కడ పార్క్‌ చేశాడో చూస్తే ఆగమే!
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
పెట్రోల్ కార్లకు ఎదురుదెబ్బ.. ఆగస్టులో ఈ కార్లు రికార్డు
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
గణేశుడి 32 రూపాలు.. ఒక్కో రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?
బిగ్‌బాస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హోస్ట్ ఎవరో తెలుసా?