Viral Video: ఆకలి మీదున్న పాము తేలును మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..

ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుంది. ఇంతలో దానికి ఒక పెద్ద తేలు కనిపిస్తుంది. అంతే ఆ పాము ఏ మాత్రం ఆలోచించకుండా వేటకు వెళ్ళింది. దాన్ని ఎలాగైనా మింగి కడుపు నింపుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ పాము.. తేలును నోటిలోకి తీసుకుంది. కానీ, ఇక్కడే ఆ పాముకు షాక్‌ తగిలినంత పనైంది.

Viral Video: ఆకలి మీదున్న పాము తేలును మింగేసింది..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే..
Snake Vs Scorpion

Updated on: Apr 17, 2025 | 8:31 PM

పాములు చాలా ప్రమాదకరమైన జీవులు. కానీ అన్ని పాములు ప్రమాదకరమైనవి కావు. విషం లేని పాములు, విషపూరిత పాములు ఉంటాయి. ఇందులో కోబ్రాస్, రక్తపింజర వంటివి చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా విషసర్పం కాటు వేసినప్పుడు…సకాలంలో చికిత్స అందకపోవటం వల్ల చాలా మంది చనిపోతుంటారు. పాము విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అది మనిషైనా లేక ఏ ఇతర జంతువు అయినా సరే విషపూరిత పాము కాటువల్ల మరణం సంభవిస్తుంది. ఇక్కడ ఒక పాము తేలుతో ఫైట్‌ చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తేలును తినాలనుకున్న పాము ఊహించలేని పరిస్థితిలో పడింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ వెళ్తుంది. ఇంతలో దానికి ఒక పెద్ద తేలు కనిపిస్తుంది. అంతే ఆ పాము ఏ మాత్రం ఆలోచించకుండా వేటకు వెళ్ళింది. దాన్ని ఎలాగైనా మింగి కడుపు నింపుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఆ పాము.. తేలును నోటిలోకి తీసుకుంది. కానీ, ఇక్కడే ఆ పాముకు షాక్‌ తగిలినంత పనైంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ పాము తనపై దాడి చేసి మింగబోతుందని తెలుసుకున్న తేలు చాకచక్యంగా వ్యవహరించింది. తలలో కొంత భాగాన్ని మింగిన తర్వాత, తేలు తన ముందు గోళ్లతో పామును గట్టిగా పట్టుకుంది… ఎంత మింగడానికి ప్రయత్నించినా అది కుదరలేదు. ఆ విధంగా ఇద్దరూ చాలా సేపు పోరాడారు. కానీ చివరికి ఏం జరిగిందో తెలియరాలేదు. ఎందుకంటే ఈ వీడియో అంతటితోనే ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us