Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!

Trending Video: ఎవరూ చూడనప్పుడు కూడా నీతిగా, నిబద్ధతతో వ్యవహరించడమే నిజమైన క్రమశిక్షణ. ఈ వైరల్ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ప్రయాణాల్లో తొందరపాటు పక్కనబెట్టి, ఇలాంటి చిన్న చిన్న నియమాలను మన జీవితంలో కూడా భాగం చేసుకుంటే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు.

Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!
Singapore Viral Video
Image Credit source: https://www.instagram.com/reel/DVIl2rvktbK

Updated on: Jun 05, 2026 | 7:10 AM

Singapore Viral Video: రోడ్డు ఖాళీగా ఉంటే చాలు.. సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా దూసుకెళ్లే రోజులివి. కానీ అర్ధరాత్రి వేళ, కంటిచూపు మేరలో ఒక్క వాహనం కూడా లేకపోయినా.. నిబంధనల కోసం ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల మనసు గెలుచుకుటున్నాడు. క్రమశిక్షణకు మారుపేరైన సింగపూర్‌లో వెలుగుచూసిన ఈ అద్భుతమైన దృశ్యం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఖాళీ రోడ్డు.. కానీ చెదరని నిబద్ధత..!

సాధారణంగా పగటిపూట ట్రాఫిక్ పోలీసులు ఉంటారనో, లేదంటే కెమెరాలకు దొరికిపోతామనో చాలామంది నిబంధనలు పాటిస్తారు. కానీ అర్ధరాత్రి 1 గంట సమయంలో, ఎవరూ చూడని వేళ కూడా ఒక వ్యక్తి ఎంత బాధ్యతగా నడుచుకున్నాడు. సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయ మహిళ కృతికా జైన్ ఈ అపూర్వ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ వీడియోలో.. ఒక వ్యక్తి అర్ధరాత్రి వేళ రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్ (పెడెస్ట్రియన్ క్రాసింగ్) వద్ద వేచి ఉన్నాడు. ఆ సమయంలో రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వాహనం కూడా అటువైపు రావడం లేదు. అయినా సరే, రోడ్డు దాటలేదు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ లైట్‌గా మారుతుందా అని ఓపికగా ఎదురుచూశాడు. సిగ్నల్ పడగానే ఎంతో ప్రశాంతంగా రోడ్డు దాటాడు. మనకు ఇది చాలా సాధారణ విషయంగా అనిపించినా, ఈ చిన్న అలవాటే ఆ దేశ సంస్కృతికి అద్దం పడుతోంది.

ఆ అలవాటే దేశానికి గుర్తింపు!

ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ కృతికా జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇది వారి అలవాటా, క్రమశిక్షణా లేక వారి ఆలోచనా విధానమా అనేది నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ చిన్న విషయమే ఆ దేశం గురించి ఎంతో గొప్పగా చెబుతోంది. అర్ధరాత్రి 1 గంటకు ఒక అపరిచిత వ్యక్తి పచ్చ సిగ్నల్ కోసం వేచి చూడటం.. ఆ దేశ పౌరుల బాధ్యతను చాటిచెబుతోంది” అంటూ ఆమె రాసుకొచ్చారు. మన చిన్న చిన్న అలవాట్లే సమాజంలో పెద్ద మార్పుకు కారణమవుతాయని ఈ దృశ్యం నిరూపించింది.

నెటిజన్ల ఫిదా.. కోట్లల్లో వీక్షణలు!

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 4.4 కోట్లకు పైగా వీక్షణలను (Views) సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. లక్షలాది మంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ సింగపూర్ పౌరుల క్రమశిక్షణను కొనియాడుతున్నారు. “క్రమశిక్షణకు ఇంతకంటే అద్భుతమైన ఉదాహరణ మరొకటి ఉండదు” అని ఒకరు కామెంట్ చేయగా.. “ఒక దేశ అభివృద్ధి కేవలం పెద్ద పెద్ద చట్టాల వల్ల మాత్రమే కాదు, పౌరుల రోజువారీ చిన్న చిన్న అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది” అని మరొకరు అభిప్రాయపడ్డారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి కఠినమైన స్వయం నియంత్రణ కనిపిస్తుందని మరికొందరు గుర్తుచేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us