Watch Video: వామ్మో.. అవి పాములనుకున్నావా.. పోట్లకాయలనుకున్నావా.. అలా పట్టేశావేంటక్కాయ్..

ఒక అందమైన అమ్మాయి సంబంధించిన వీడియో ఒక ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.. కానీ ఆ వీడియో చూసిన జనాలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. అందమైన అమ్మాయి అంటున్నావు, భయపడుతున్నారంటున్నావు.. ఇంతకు విషయం ఏంటి అనుకుంటున్నారా?.. మేం చెప్పడం ఎందుకు.. ఇక్కడ జరిగింది చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ లుక్కేయండి

Watch Video: వామ్మో.. అవి పాములనుకున్నావా.. పోట్లకాయలనుకున్నావా.. అలా పట్టేశావేంటక్కాయ్..
Snake Video

Updated on: Oct 03, 2025 | 5:23 PM

సాధారణంగా పాము పేరువింటనే గజగజ వణికిపోతాం.. అమ్మాయిలు అయితే మరీ.. పాము కాదు..ఇంట్లో బొద్దింక కనిపించినా వాళ్లు ఎగిరిగంతేస్తారు. కానీ ఇక్కడో అమ్మాయి మాత్రం ఎంతో ధైర్యంగా సుమారు 7,8 అడుగులున్నా పాములనే పట్టేస్తుంది. వాటితో ఆడుకుంటూ ఒక డబ్బాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన కొందరు జనాలు భయాందోళనకు గురవుతుంటే.. మరికొందరు మాత్రం ఆశ్చర్యపోతున్నారు.

వైరల్‌ వీడియో ప్రకారం.. పింక్‌ కలర్‌ చీరలో ఒక రూమ్‌లోకి వచ్చిన ఒక యువతి..నేరుగా పాములు దాక్కునన్న ప్రదేశానికి వెళ్లి అక్కడున్న రెండు పాములను అమాంతం చేతిలోకి తీసుకుంది.తర్వాత ఆ రెండు పాములను వేర్వేరు కంటైనర్లలో వేసి మూత పెట్టేసింది. మళ్లీ ఏమి జరగనట్టు రూమ్‌లోంచి బయటకు వచ్చింది.అక్కడున్న వారు ఆమె పామును పట్టుకున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇవికాస్తా వైరల్‌గా మారాయి.

ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్‌ చేశారు. ఇంత అందమైన అమ్మాయి పామును పట్టుకుంది, అందుకే పాము కూడా తనను తాను హాయిగా పట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది.అని ఒక యూజరు రాసుకొచ్చాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.