ప్రపోజల్ కోసం ఎంపైర్ స్టేట్ ఎక్కిన ఈ క్రేజీ కపుల్ బ్యాగౌండ్ తెలిస్తే మీరు బిత్తరపోవాల్సిందే..!
ప్రేమ గుడ్డిదే కాదు... పిచ్చిది కూడా. ఎందుకంటే ఎంతటి పనైనా చేయిస్తుంది. అలాంటి పనే ఓ ఇద్దరు ప్రేమికులైన పర్వతారోహకులు చేసి ఇప్పుడు వార్తల్లో ట్రెండింగ్ గా నిల్చారు. ఆ రూఫ్ టాపర్స్ పేర్లు ఏంజెలా నికోలౌ, ఇవాన్ బీర్కస్. వీరిద్దరూ న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకెక్కి ఒకరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకున్న దృశ్యాలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారాయి. అయితే, ఘటన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది..?

ప్రేమ గుడ్డిదే కాదు… పిచ్చిది కూడా. ఎందుకంటే ఎంతటి పనైనా చేయిస్తుంది. అలాంటి పనే ఓ ఇద్దరు ప్రేమికులైన పర్వతారోహకులు చేసి ఇప్పుడు వార్తల్లో ట్రెండింగ్ గా నిల్చారు. ఆ రూఫ్ టాపర్స్ పేర్లు ఏంజెలా నికోలౌ, ఇవాన్ బీర్కస్. వీరిద్దరూ న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైకెక్కి ఒకరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకున్న దృశ్యాలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారాయి. అయితే, ఘటన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏంజెలా నికోలౌ, ఇవాన్ బీర్కస్ ఈ ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రూఫ్ టాపర్స్. వీరి సాహస జీవితాన్ని ఆధారంగా చేసుకుని స్కైవాకర్స్ : ఏ లవ్ స్టోరీ అనే డాక్యుమెంటరీ కూడా రూపొందింది. అది నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే రెండో ఎత్తైన భవనం మెర్డెకా 118తో సహా అనేక ఆకాశహర్మ్యాలను ఎక్కడం వీరికి ప్రేమతో పెట్టిన విద్య.
ఒకప్పుడు బీటిల్స్ బృందం ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అని పాడింది. కానీ, ఏంజెలా నికోలౌ, ఇవాన్ బీర్కస్ ల ప్రేమకథలో ప్రేమతో పాటే.. అపారమైన ధైర్యం కూడా ఆశ్చర్యపర్చేది. ఆకట్టుకునేది. ఎందుకంటే, వీరిద్దరూ ఎవ్వరి కంటా పడకుండా న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్జింగ్ పైకెక్కాక ప్రేమ సందేశంతో కూడిన జెండాను ఇవాన్ ఓపెన్ చేసి ఏంజెలాకు వివాహ ప్రతిపాదన చేశాడు. మొత్తంగా ప్రపంచంలోనే ఓ ఎత్తైన బిల్డింగ్ పైన ఈ ప్రేమజంట నిశ్చితార్థం జరిగిపోయింది.
కానీ, ఆ ఎస్టేట్ అధికారుల అనుమతి లేకుండా భవనంపైకి ఎక్కడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వీరిని అరెస్ట్ చేసేందుకు మూడు హెలికాప్టర్లలో వీరిని ఆ టవర్ పైన ఫాలో చేశారు. చివరకు జంటను అరెస్ట్ చేసి, ఆస్తి ధ్వంసం, అనుమతి లేని అనధికార ప్రవేశం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. గత మూడు రోజులుగా ఒక ట్రెండింగ్ టాపిక్ గా సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ప్రేమ కోసం ఆకాశాన్నంటిని సాహసం!
ఈ ఘటన జూలై 1వ తేదీన మధ్యాహ్నం వేళ న్యూయార్క్ పోలీసులు గుర్తించారు. నల్లని దుస్తులు ధరించి, ముఖాలకు మాస్కులు పెట్టుకుని ఈ జంట న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై అంతస్తుకు చేరుకుంది. ఏంజెలాకు 33 ఏళ్లైతే.. ఇవాన్ ఆమె కంటే ఒక ఏడు చిన్నవాడు. అంటే 32 ఏళ్లు. ఈ ఇద్దరూ 1 వెయ్యి 454 అడుగుల ఎత్తులో ఉన్న యాంటెన్నాను పట్టుకుని నిలబడి When the power of love beats the love of power, the world knows peace. అనే కొటేషన్ తో ఉన్న జెండాను విప్పి తన ప్రేమను ఏంజెలాకు ప్రతిపాదించాడు ఇవాన్. సినిమాల్లో చూపించినంత స్టైలిష్ గా మోకాలిపై కూర్చుని చేసిన ప్రతిపాదనకు ఏంజెలా అంగీకారం తెలిపింంది. వెంటనే ఒక రింగ్ ను కూడా ఏంజెలాకు తొడిగి పద్నాలుగు వందల 54 అడుగుల ఎత్తులో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లోకెక్కింది ఈ రష్యన్ ప్రేమ జంట.
అసలు ఈ రష్యన్ జంట అంత పైకి ఎలా చేరుకున్నారు?
102వ అంతస్తులో ఏర్పాటు చేసిన మెష్ గేట్ ను దాటి.. సామాన్య జనానికి అనుమతి లేని 103వ అంతస్తులోకి చేరుకుంది ఈ రష్యన్ జంట ఏంజెలా, ఇవాన్. 102వ అంతస్తు, 103వ అంతస్తుకు మధ్య ఉన్న మెట్ల మార్గంలో భద్రతా గేట్లు ఏర్పాటు చేసింది ఈ ఎస్టేట్ యాజమాన్యం. గతంలో కూడా కొందరు ఎస్టేట్ టాప్ వరకు వెళ్లి సెల్ఫీల కోసం యత్నించడంతో భద్రతా చర్యలు చేపట్టారు.
ఏంజెలా, ఇవాన్ ఎంపైర్ స్టేట్ లవ్ స్టోరీ!
ఏంజెలా, ఇవాన్ కు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసాధారణమైన చర్య అని కొందరు పొగిడ్తే.. మరికొందరు అత్యంత నిర్లక్ష్యమంటూ విమర్శలు గుప్పించారు. ఓ ప్రత్యక్షసాక్షి అయిన ఓ వ్యాపారి మాట్లాడుతూ తన జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని, నడక ఆపేసి న్యూయార్క్ నగరమంతా పైకి చూస్తూ నిల్చిపోవడం ఓ అనూహ్యమైన ఘటన అన్నాడు. నల్లని దుస్తువుల్లో ఇద్దరూ కనిపించడంతో మరో ఉగ్రదాడి జరుగుతుందా అన్న భయమూ నెలకొంది. నిరసన అని కూడా కొందరు భావించారు. ఆ తర్వాత పెళ్లి ప్రతిపాదన అని తెలిసి ఆశ్చర్యపోయారు. మోకాలిపై అంత ఎత్తులో కూర్చుని లవ్ ప్రపోజ్ చేస్తూ ప్రియురాలి వేలికి ఉంగరం తొడిగే రొమాంటిక్ దృశ్యం ఇన్ స్టాలో పెద్ద చర్చకే తెరలేపింది.
ఏంజెలా, ఇవాన్ ఎవరు..?
వీరిద్దరూ రష్యన్స్. ఈ జంట ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో నివశిస్తోంది. రూఫ్ టాపర్స్ గా వీరికి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఆకాశహర్మ్యాలు, యాంటెన్నాలు, వంతెనలు వంటి ఎత్తులో ఉండే ప్రమాదకర నిషేధిత నిర్మాణాలపైకి ఎక్కి సాహస విన్యాసాలు చేసేవారిని రూఫ్ టాపర్స్ గా పిలుస్తుంటారు. ఇవాన్ పాప్ సంగీతరంగంలో పనిచేస్తున్న కళాకారుడు కాగా.. ఏంజెలా చిత్రకారిణి. నృత్యంతో పాటు, అక్రోబాటిక్స్ లోనూ ప్రవేశముంది. ఏంజెలా తండ్రి దిమిత్రి నికోలౌకు కూడా ఎత్తైన భవనాలెక్కడమంటే ఇష్టం. అందులో తప్పేంలేదన్నది ఆయన అభిప్రాయం. ఈ జంట 2016లో మొదట కలుసుకుంది. అప్పటినుంచీ కలిసి రూఫ్ టాపింగ్ చేయడం వీరిద్దరి జర్నీలో భాగమైపోయింది. ఏంజెలాకు రూఫ్ టాపింగ్ లో రోల్ మాడల్ ఇవానే. నిబంధనలు బ్రేక్ చేయడమంటే ఈ జంటకు ఇష్టం. అప్పుడే థ్రిల్ అన్నది వీరి మోటో.
2024లోనే వీరి ప్రేమకథ, వీరి సాహసోపేతమైన జర్నీని ఆసరాగా చేసుకుని స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ఇప్పటికే వీరు చైనాలో ఇంకా పూర్తికాని అత్యంత ఎత్తైన 117 అంతస్థుల గోల్డెన్ ఫైనాన్స్ భవనంతో పాటు.. ప్రపంచంలోనే రెండో ఎత్తైన భవనంగా పేరుపొందిన మర్డెకా 118 వంటి భవనాల టాప్ ఎండ్స్ కు అధిరోహించి వార్తల్లో నిల్చారు. ఈ ఇద్దరికీ రూఫ్ టాపింగ్ అంటే ఇష్టం. వీరి జీవితాల్లో ఇద్దరికీ ఒకే టేస్ట్ ఉండటంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ను ఎక్కినవారు అరుదు!
1994లో ఫ్రెంచ్ పర్వతారోహకుడు అలైనా రాబర్ట్ ఈ భవనాన్ని ఎక్కాడు. 2023లో గాయకుడు, నటుడు జారెడ్ లెటో అధికారిక అనుమతితో 86 అంతస్థు నుంచి పై భాగం వరకూ 18 అంతస్థులు ఎక్కి తన బ్యాండ్ థర్టీ సెకండ్స్ టూ మార్స్ ప్రపంచ పర్యటన ప్రచారాన్ని అక్కడి నుంచి ఆరంభించాడు. ఆ తర్వాత స్థానం ఇప్పుడు ఏంజెలా, ఇవాన్ లదే. ప్రేమ ఎత్తు ఎంతో చెప్పడానికి ఎత్తైన టవర్ పైకెక్కి ప్రేమ, పెళ్లి ప్రతిపాదనతో ఇప్పుడు ఏంజెలా, ఇవాన్ ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ గా మారారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
