Viral Video: భారీ భవనం రెయిలింగ్‌ పై చిక్కుకున్న పిల్లి.. రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి..

|

Dec 20, 2021 | 3:33 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నెట్టింట జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: భారీ భవనం రెయిలింగ్‌ పై చిక్కుకున్న పిల్లి.. రెస్క్యూ టీమ్ ఎలా కాపాడిందో చూడండి..
Cat
Follow us on

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నెట్టింట జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువుల ఫన్నీ వీడియోలు.. లేదా జంతువులు దాడి చేసే వీడియోలు మనం చూస్తూ ఉంటాం.. ఇక జంతువులు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే మాత్రం మనుషులు వాటిని కాపాడుతుంటారు. ప్రాణాలకు తెగించి మరి ప్రమాదంలో ఇరుక్కున్న జంతువులను కాపాడిన వీడియోలు చాలానే చూశాం. ఇప్పుడు ఈ వీడియో కూడా దానికి సంబంధించిందే.. మనుషులు పెంచుకునే జంతువుల్లో కుక్క తర్వాత ఉండేది పిల్లే.. చాలా మంది పిల్లులను పెంచుకుంటూ ఉంటారు. ఈ వీడియాలో సుమారు 20 అంతసుల పైగా ఉన్న ఓ భవనం పై ఒక పిల్లి చిక్కుకుంది. దాన్ని రెస్క్యూ టీమ్ ఎంతో చాకచక్యంగా కాపాడారు.

ఓ భారీ భవనం పై ఓ పిల్లి దాదాపు 20వ అంతస్థులో బాల్కనీ నుంచి బయటకు వచ్చి అనుకోకుండా.. భవనం రెయిలింగ్‌ పై ఆగింది. ముందుకు వెనక్కు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయింది. అది గమనించిన ఆ ఇంటి యజమాని పిల్లిని రక్షించాలని రెస్క్యూ టీమ్ ను కోరడంతో.. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ ఆ పిల్లిని కాపాడారు. భవనం కింద కొంతమంది క్లాత్ ను వలగా పట్టుకోగా.. ఒక వ్యక్తి భవనం బాల్కనీ నుంచి ఈ పిల్లిని ఒక కర్ర సాయంతో కిందకు నెట్టేశాడు. ఆ పిల్లి అక్కడి నుంచి నేరుగా ఆ వలలో పడింది. పడిన వెంటనే అక్కడి నుంచి బ్రతుకు జీవుడా అంటూ పరిగెత్తింది ఆ పిల్లి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. రెస్క్యూ టీమ్ ను కొనియాడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు, జంతు ప్రేమికులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year End 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఎవరికి ఎక్కువ అంటే..