పసిడి వర్ణంతో మెరిసిపోతున్న అరుదైన నాగుపాము.. నెట్టింట వైరల్ అవుతున్న గోల్డెన్ కోబ్రా వీడియో!

ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన విషయాలు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక అరుదైన దృశ్యం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా మనం చూసే త్రాచుపాములు (కోబ్రాలు) నలుపు, ముదురు గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. కానీ, బంగారు వర్ణంలో మిలమిలా మెరిసిపోతున్న ఒక అరుదైన గోల్డెన్ కోబ్రా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పసిడి వర్ణంతో మెరిసిపోతున్న అరుదైన నాగుపాము.. నెట్టింట వైరల్ అవుతున్న గోల్డెన్ కోబ్రా వీడియో!
Rare Golden Cobra

Updated on: Sep 27, 2026 | 9:32 AM

సాధారణంగా నలుపు లేదా గోధుమ రంగులో కనిపించే నాగపాములకు భిన్నంగా, పసిడి కాంతితో మెరిసిపోతున్న ఒక అరుదైన గోల్డెన్ కోబ్రా వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కెమెరా ముందే అకస్మాత్తుగా పడగ విప్పి నిలబడిన ఈ పాము రూపం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కెమెరా ముందు ప్రశాంతంగా కనిపించిన ఆ పాము, అకస్మాత్తుగా తన పడగను విప్పి నిటారుగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించింది.

కెమెరా ముందు పడగ విప్పిన గోల్డెన్ కోబ్రా:

వైరల్ అవుతున్న ఈ చిన్న వీడియోలో, ఆ పాము మొదట ఎంతో శాంతంగా కనిపిస్తుంది. అయితే అకస్మాత్తుగా అది కెమెరా వైపు చూస్తూ గంభీరంగా పడగ విప్పి నేరుగా నిలబడుతుంది. పాము శరీరం మొత్తం పసుపు, బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉండటం విశేషం. ముఖ్యంగా పడగ విప్పినప్పుడు దాని వెనుక భాగంలో ఉన్న డిజైన్, ఆ పసిడి మెరుపు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. పాము అనగానే భయపడే జనాలు కూడా ఈ హావభావాలను, దాని అరుదైన వర్ణాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వన్యప్రాణి నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాముల శరీర రంగు అనేది వాటిలో ఉండే పిగ్మెంటేషన్ ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల లేదా పిగ్మెంటేషన్‌లో జరిగే మార్పుల వల్ల పాములు ఇలాంటి అసాధారణమైన పసుపు, తెలుపు లేదా బంగారు రంగుల్లోకి మారుతుంటాయి. అయితే, కేవలం వీడియోలో కనిపిస్తున్న రంగు ఆధారంగా దానిని ఒక ప్రత్యేకమైన జాతి అని చెప్పలేమని, అది ఏ ప్రాంతంలో లభించింది. దాని శాస్త్రీయ గుర్తింపు ఆధారంగానే ఖచ్చితమైన జాతిని నిర్ధారించగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా జంతువుల లేదా సరీసృపాల రంగులు అవి ఉండే వాతావరణంలో కలసిపోవడానికి సహాయపడతాయి. ఇది శత్రువుల నుండి తప్పించుకోవడానికి, వేటాడటానికి ఉపకరిస్తుంది. కానీ, ఇలాంటి ప్రకాశవంతమైన బంగారు రంగు వల్ల ఇవి వాతావరణంలో త్వరగా శత్రువుల కంటికి చిక్కే అవకాశం ఉంది. దాంతో ప్రకృతిలో ఇటువంటి పాముల మనుగడ కాస్త సవాలుగా మారుతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన వేలాది మంది నెటిజన్లు ఇంతవరకు ఇలాంటి పామును ఎప్పుడూ చూడలేదు, నిజంగా బంగారంతో తయారు చేసినట్లుంది అని కామెంట్లు పెడుతున్నారు. ప్రకృతి సృష్టించిన ఈ అరుదైన జీవి వీడియో ఇప్పుడు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us