Viral Video: అంత ఓవరాక్షన్ ఎందుకు భయ్యా.! ఇప్పుడు చూడు ఏమైందో..

|

Oct 17, 2024 | 2:52 PM

కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని విన్యాసలు చేస్తుంటారు. అందులో వారు చేసిన కొన్ని విన్యాసాలు వాళ్ల ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన కంటి చూపుతో పామును నియంత్రించగలనని భావించి.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇంతకీ అతన్ని ఆ పాము ఏం చేసింది? అతడు పామును నియంత్రించగలిగాడా? అనేది మీరే చూడండి..!

Viral Video: అంత ఓవరాక్షన్ ఎందుకు భయ్యా.! ఇప్పుడు చూడు ఏమైందో..
Pally With Snake
Follow us on

పాములు అత్యంత ప్రమాదకరమైనవి అన్ని మనందరికీ తెలుసు.. అందుకే అందరం వాటి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాం. అయితే కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని విన్యాసాలు చేస్తున్నారు. కొన్ని విన్యాసాలు చేసి వాని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన కంటి చూపుతో పామును నియంత్రించగలనని భావించి.. ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇంతకీ అతన్ని ఆ పాము ఏం చేసింది? అతడు పామును నియంత్రించగలిగాడా? అనేది మీరే చూడండి..!

“therealtarzann” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడిమోను షేర్ చేశారు. ఒక వృద్ధుడు కుర్చీలో పాము ఎదురుగా ఓవర్ కాన్ఫిడెంట్‌గా కూర్చున్నాడు. అతను మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, అతను తన కళ్ళతో పామును నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ, పాము తన కళ్ళ మధ్య కాటువేయడంతో అతను త్వరగా ఒక కఠినమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. పాము ఆకస్మిక దాడి అతన్ని షాక్‌కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడయోకు 1.3 మిలియన్లకు పైగా లైక్‌‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెంట్స్ ఎందుకు భయ్యా..అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

మనిషి మూర్ఖత్వం ఒక సూపర్‌పవర్ అని సెటైరికల్‌గా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మనకెందుకు భయ్యా ఇవ్వన్నీ.. ఇప్పుడు చూడు ఎమైందో అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ మధ్య చిన్న పెద్ద అని తేడా లేకుండా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు. దీంతో కొంత మంది ప్రాణాలు కొల్పోతున్నారు.

వీడియో ఇదిగో:

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి