పజిల్స్ అంటే ఇష్టపడినివారు ఎవరు చెప్పండి. గతంలో అంటే కేవలం పుస్తకాలు రూపంలోనే ఈ పజిల్స్ లభించేవి. కానీ ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది. అందులో కావాల్సినంత ఇంటర్నెట్ ఉంది. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ అందరికీ ఉన్నాయ్. దీంతో పజిల్స్ కూడా అందరికీ చేరువయ్యాయ్. అవి కూడా కేవలం పదజాలానికి సంబంధించిన పజిల్స్ మాత్రమే కాదు. బ్రెయిన్ టీజర్స్.. మన కళ్ల ఫోకస్ ఎంత ఉందో చెప్పే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్.. ఇవి ఈ పాటికి మీ కంట కూడా పడే ఉంటాయ్. ఎక్కువగా సెల్ఫ్ కాన్పిడెన్స్ ఉన్నవాళ్లు ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా మీ కోసం ఓ కిర్రాక్ పజిల్ తెచ్చాం.
పైన ఫోటోను బాగా గమనించండి. హా.. ఏముంది అక్కడ. పాడుబడ్డ ఇంటిని కూల్చేశారు. అంతకుమించి ఏముంది అని కళ్లు ఎగరేయకండి. ఆ ఫోటోలో ఓ కుందేలు కూడా ఉంది. బాగా దృష్టి పెట్టి చూస్తేనే అది కంటికి కనిపిస్తుంది. ఏదో పైపైన చూస్తే మాత్రం అస్సలు చిక్కదు. ఇంకో విషయం ఏంటేంటే.. మీరు 30 సెకన్లలో దాన్ని కనిపెట్టాలి. ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా కనిపెడతారు. మీరు ఇస్మార్ట్ అనుకుంటే ఇచ్చిన సమయంలో దాన్ని ఆచూకి పట్టాలి.
ఏంటి ఆ క్రేజీ కుందేలును గుర్తించారా..? అయితే మీరు సూపర్ అంతే. సమాధానం తెలియకపోతే.. ఇంకోసారి ప్రయత్నించండి. మా వల్ల కాదు బాబోయ్ అనేవాళ్ల కోసం మేము ఆన్సర్ ఉన్న ఫోటోను దిగువన ఇవ్వబోతున్నాం. ఇలాంటి పజిల్స్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఎంజాయ్.. పండగో.
Rabbit
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..