Optical illusion: ఈ ఫొటో చూడ్డానికి కుక్కలా కనిపిస్తోంది కదూ! సరిగ్గా చూడండి ఇందులో ఓ పదం దాగి ఉంది.

|

Feb 19, 2023 | 9:21 AM

ఆప్టికల్‌ ఇల్యూజన్‌.. చూసే కళ్లను మాయ చేసే ఈ పజిల్స్‌ ఎంతో ఆసక్తిరంగా ఉంటాయి. పజిల్‌ను సాల్వ్‌ చేసినప్పుడల్లా ఎగ్జైట్‌మెంట్‌ పెరుగుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఇలాంటి వాటికి ఫుల్‌ డిమాండ్‌ ఉండడానికి కూడా కారణం ఇదే. మీరు ఇప్పటి వరకు..

Optical illusion: ఈ ఫొటో చూడ్డానికి కుక్కలా కనిపిస్తోంది కదూ! సరిగ్గా చూడండి ఇందులో ఓ పదం దాగి ఉంది.
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్‌.. చూసే కళ్లను మాయ చేసే ఈ పజిల్స్‌ ఎంతో ఆసక్తిరంగా ఉంటాయి. పజిల్‌ను సాల్వ్‌ చేసినప్పుడల్లా ఎగ్జైట్‌మెంట్‌ పెరుగుతూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఇలాంటి వాటికి ఫుల్‌ డిమాండ్‌ ఉండడానికి కూడా కారణం ఇదే. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూజన్స్‌ చూసి ఉంటారు. నెంబర్‌, ఫొటో ఇలా రకరకాల ఆప్టికల్‌ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫొటో ఒకటి నెటిజన్లను తెగ అట్రాక్ట్‌ చేస్తోంది.

పైన కనిపిస్తున్న ఫొటోను చూడగానే కుక్కలాంటి జంతువు అనే భావన కలిగి ఉంది కదూ.! తోక, కాళ్లు, నోరు, వీటిని చూస్తే మీకేంటి ఎవరికైనా అదే ఆలోచన మదిలో మెలుగుతుంది. అయితే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలో ఇంతకు మించి అర్థం దాగి ఉంది. ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోను రూపొందించిన డిజైనర్‌ అందులో ఓ పదాన్ని జోడించాడు. ఫొటోను జాగ్రత్తగా గమనిస్తే కానీ ఆ పదం కనిపించదు. 10 సెకండ్లలో ఈ ఫొటోలోని ఆ పదాన్ని గుర్తించండని సోషల్‌ మీడియాలో బ్రెయిన్‌ టీజర్‌ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఆ పదం ఏంటో కనిపించిందా.? లేదా.. అయితే ఓసారి జాగ్రత్తగా గమనిస్తే తోక ప్రాంతంలో J అక్షరం కనిపిస్తోంది కదూ.. అలాగే మిగతా చోట్ల కూడా అక్షరాలు కనిపిస్తున్నాయి. అక్షరాలను వెరైటీగా డిజైన్‌ చేసి కుక్క బొమ్మ వచ్చేలా డిజైన్‌ చేశారు. ఈ ఫొటోలో ‘JAURA’ అనే పదం కనిపిస్తోంది. ఇంతకీ ఈ పదం అర్థం ఏంటో తెలుసా.? జౌరియా అనేది స్పానిష్‌ పదం. దీని అర్థం వేట కుక్కల గుంపు. వేట కుక్క పేరు కాబట్టే కుక్క రూపంలో పదాన్ని డిజైన్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..