
పిరుదుల శ్వాస: శ్వాస తీసుకోవడం అనేది ప్రతి ప్రాణికి ఒక ప్రాథమిక అవసరం. కానీ, ఊపిరితిత్తులు పనిచేయడం మానేసినప్పుడు ఏం జరుగుతుంది? జపనీస్ వైద్యులు, శాస్త్రవేత్తలు పిరుదుల శ్వాస అనే వైద్య పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇది జోక్ కాదు.. వైరల్ ట్రెండ్ కూడా కాదు. ఇది ఆధునిక వైద్య శాస్త్రంలో ఒక ప్రయోగం. దీని పేరు వినగానే ముందు మీరు నవ్వుకోవచ్చు. కానీ, ప్రాణాలను కాపాడటం దీని లక్ష్యం.
పిరుదుల శ్వాస(butt breathing) అంటే ఏమిటి?
ఇంటర్నెట్‌లో బట్ బ్రీతింగ్ అని పిలవబడే దీనికి శాస్త్రీయ నామం ఎంటరల్ వెంటిలేషన్. ఇది పురీషనాళం ద్వారా శరీరాన్ని ఆక్సిజన్‌తో నింపడానికి ప్రయత్నించే వైద్య సాంకేతికత. ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, ఈ ఆలోచన పూర్తిగా సైన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
మానవ పరీక్షలు ఏం వెల్లడించాయి?
ఈ సాంకేతికతకు సంబంధించి 27 మంది పురుషులపై మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. అధిక మొత్తంలో ఆక్సిజన్ కలిగి ఉన్న పెర్ఫ్లోరోకార్బన్ ద్రవం అనే ప్రత్యేక ద్రవాన్ని ఉపయోగించారు. అధ్యయన ఫలితాల ప్రకారం ఈ పద్ధతి చాలా మందికి సురక్షితమైనది. శరీరం బాగా తట్టుకుంటుంది. ఇంకా, ఇది ఎటువంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగించలేదు.
పిరుదుల శ్వాస(butt breathing) ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? :
మనుషులకు ఈ టెక్నిక్ ప్రయోజనకరంగా ఉంటుంది. వెంటిలేటర్ నుండి కూడా తగినంత ఆక్సిజన్ అందని వారికి. లేదా శ్వాస తీసుకోవడానికి వేరే మార్గం లేని అత్యవసర పరిస్థితుల్లో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ టెక్నిక్ ICU, క్రిటికల్ కేర్‌లో ప్రాణాలను రక్షించే ఎంపికగా మారుతుందని వైద్యులు నమ్ముతున్నారు. ఈ పరిశోధనలో పనిచేసిన శాస్త్రవేత్తలకు 2024లో నోబెల్ బహుమతి లభించింది. ఈ టెక్నిక్ మానవులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..