Viral Video: పాపం నవ వధువు… అమ్మ దిష్టి తీస్తుండగా.. అనుకోకుండా

ఓ ఆకతాయి చేసిన పని.. వెడ్డింగ్ ఈవెంట్ కవర్ చేసేందుకు వెళ్లిన ఫోటో, వీడియోగ్రాఫర్ల బృందానికి చిక్కులు తెచ్చి పెట్టింది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Viral Video: పాపం నవ వధువు... అమ్మ దిష్టి తీస్తుండగా.. అనుకోకుండా
Bizarre Incident

Updated on: Apr 27, 2022 | 8:28 PM

Trending Video: పాత కాలంలో ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్లాలి.. లేదంటే ఫోటో గ్రాఫర్‌నే ఇంటికి పిలిపించుకోవాలి. పెద్ద.. పెద్ద ఫంక్షన్లు, పెళ్లిళ్లు అప్పుడు మాత్రమే వీడియోలు షూట్ చేసేవారు. కానీ ప్రజంట్ అంతా మొబైల్ ఫోన్‌లోనే. మన చేతిలో ఫోన్ ఉంటే.. ప్రపంచం కూడా ఉన్నట్లే. ఫోన్‌లో ఫోటోలు తీయొచ్చు, వీడియోలు తీయొచ్చు.. వాటిని మనకు నచ్చినట్లుగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) ట్రెండ్ నడుస్తోంది. ఎఫ్‌బి, ఇన్‌స్టా, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లలో యాక్టివ్‌గా ఉంటున్నారు జనాలు. ఈ క్రమంలోనే పలు రకాల వైరల్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంచెం వింతగా అనిపిస్తే చాలు.. జనాలు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియోనే నెట్టింట ట్రెండ్ అవుతోంది. అందులో కొత్త పెళ్లి కూతురికి.. ఆమె తల్లి ఇంటి ముందు దిష్టి తీస్తుంది. దిష్టి తీసిన అనంతరం ఆ కొబ్బరికాయ పెళ్లి కూతురు తలపై నుంచి విసరాలనుకుంది. కానీ దురదృష్టవశాత్తూ అది ఆమె తలకు తగిలి.. పగిలిపోయింది. పాపం.. నవ వధువుకు కాస్త గట్టిగానే దెబ్బ తగిలింది. ఈ ఊహించని సంఘటనతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. అయితే దిష్టి తీసిన తల్లి.. వెంటనే తన పొరపాటు తెలుసుకుని కూతురు దగ్గరుకు వెళ్లి కుమార్తె యోగక్షేమాలు తెలుసుకుంది.

సహజంగానే ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ పెళ్లి ఈవెంట్ కవర్ చేస్తోన్న బృందంలోని ఓ వ్యక్తి.. అంతవరకు వీడియో కట్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. అది కాస్తా క్షణాల్లో వైరలయ్యింది.  నెటిజన్లు కూడా తమకు ఇష్టమొచ్చిన కామెంట్స్‌తో పూర్తి వివరాలు తెలియకుండానే ఈ వీడియోను రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేశారు. వధూవరుల కుటుంబాలకు కూడా ఈ వీడియో కాస్త అసౌకర్యాన్ని కలిగించింది. ఆ ఆకతాయి కారణంగా టోటల్ ఈవెంట్ కవర్ చేసిన ఫోటో గ్రాఫర్, వీడియోగ్రాఫర్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి కూతురికి.. ఆమె తల్లి దిష్టి తీయబోతే అది కాస్తా మిస్ ఫైర్ అయ్యింది. అంతే.. దీనికి పైత్యంతో కూడిన కామెంట్స్ పెట్టకండి.

Also Read: Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జింకను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అంతే

Loading...
Unable to load recommendations.
Follow Us