అప్పుడే పుట్టిన పిల్లలను.. వారి బరువు ఆధారంగా కొన్నిసార్లు మహాబలుడు అంటుంటారు. ఇలా పుట్టిన ఎంతో మందిని మనం నిత్యం ఎక్కడో చూట చూస్తేనే ఉన్నాం. అందుకు సంబంధించిన వార్తలు కూడా వస్తూనే ఉన్నాయి. అయితే, సాధారణంగానే.. పిల్లలు పుట్టిన వెంటనే అరవడం చేస్తుంటారు. ఏడవడం, కేకలు వేయడం చేస్తుంటారు. ఇంకొందరు చేయి ఇస్తే.. చేతి వేళ్లను పట్టుకుంటారు. అయితే, అంతగా బలం వారిలో ఉండదు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లాడి గురించి తెలిస్తే.. మీటర్ లేచిపోవడం ఖాయం. వాడు అప్పుడే పుట్టినా.. వాడి బలం మాత్రం బలరాముడికి ఉన్నంత ఉంది. వాడు పట్టిన చేయిని అస్సలు వదిలితే ఒట్టు. వదిలించుకునేందుకు వైద్యులు ప్రయత్నించినా.. ఓ పట్టాన వదిలిపెట్టలేదు.
ఆపరేషన్ చేసి బయటకు తీసిన బిడ్డను వైద్యులు క్లీన్ చేశారు. అనంతరం వాడిని తల్లి పక్కన బెడ్‌పై పడుకోపెట్టారు. చిన్ని చిన్ని కన్నులు తెరిచి చూస్తున్నాడు. చిట్టి చేతులతో వైద్యుడి చేతి వేళ్లను పట్టుకున్నాడు. పసివాడి బలం ఏముంటింది? ఈజీగా వదిలించుకోవచ్చులే అనుకున్నాడు సదరు వైద్యుడు. కానీ, వాడు మహాబలుడిలా ఉన్నాడు. పట్టుకున్న వేలిని వదిలితే ఒట్టు. ఎంత వదిలించుకునేందుకు ప్రయత్నించినా.. వదలు ఇంచు కూడా కదలడం లేదు. గట్టిగా పట్టుకున్నాడు. వేళ్లు వెనక్కి లాగితే.. చేతి గ్లౌజ్ బయటకు వస్తుందే తప్ప.. వాడు మాత్రం అస్సలు వదలడం లేదు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఆ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటూనే.. చిన్నోడిపై కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. బాలుడా మహాబలుడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..