AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాతృత్వానికి అడ్డురాని జాతి వైరం.. పాలిచ్చి కుక్కపిల్లను సాకుతున్న వానరం..!

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మానవత్వానికే ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. సహజంగా కోతికి, కుక్కకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఒక వానరం ఆ వైరాన్ని మరచి, ఒక కుక్క పిల్లను తన సొంత బిడ్డలా సాకుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

Monkey Dog Motherhood
N Narayana Rao
| Edited By: |

Updated on: May 08, 2026 | 5:43 PM

Share

ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అపురూప ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మానవత్వానికే ఒక గొప్ప పాఠం నేర్పుతోంది. సహజంగా కోతికి, కుక్కకు మధ్య జాతి వైరం ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం ఒక వానరం ఆ వైరాన్ని మరచి, ఒక కుక్క పిల్లను తన సొంత బిడ్డలా సాకుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

సత్తుపల్లి పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కోతుల గుంపులు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే సుమారు వారం రోజుల క్రితం, ఒక కోతి తన గుంపుతో కలిసి ఒక ఇంటి ఆవరణలోకి వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న చిన్న కుక్క పిల్లను చూసిన ఆ కోతి, దానిపై దాడి చేయకుండా ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఆ నిమిషం నుంచి నేటి వరకు, ఆ కుక్క పిల్లను తన గుండెలకు హత్తుకుని వదలకుండా తిప్పుతోంది.

సాధారణంగా కోతులు ఆహారం కోసం లేదా భయంతో ఇతర జంతువులను వేధిస్తుంటాయి. కానీ ఈ కోతి మాత్రం ఆ కుక్క పిల్లకు ఎక్కడా దెబ్బ తగలకుండా, చెట్ల మీదకు, గోడల మీదకు దూకుతున్నప్పుడు కూడా తన చంకలోనే భద్రంగా పట్టుకుంటోంది. అంతేకాదు ఆ కుక్క పిల్ల ఆకలితో ఏడ్చినప్పుడు, ఆ వానరం మాతృత్వంతో దానికి పాలు ఇస్తూ ఆకలి తీరుస్తోంది. గుంపులోని ఇతర కోతుల నుంచి కూడా ఆ కుక్క పిల్లకు ఎలాంటి హాని కలగకుండా ఈ వానరం కాపాడుతోంది.

ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్యే విద్వేషాలు పెరిగిపోతున్న తరుణంలో, నోరులేని జీవాలు ఇలాంటి ప్రేమను కనబరచడం అందరినీ ఆలోచింపజేస్తోంది. తోటి మనిషి ఆపదలో ఉంటే కనీసం పలకరించని ఈ రోజుల్లో, భిన్న జాతికి చెందిన జీవిని తన బిడ్డలా సాకుతున్న ఈ వానరం మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

సత్తుపల్లి పట్టణ వీధుల్లో ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వారం రోజులుగా ఆ కుక్క పిల్ల కోతి చెంతనే సురక్షితంగా ఉండటం చూసి జంతు ప్రేమికులు మురిసిపోతున్నారు. “ప్రేమకు భాష, జాతి అనే భేదాలు లేవు” అని ఈ మూగ జీవం నిరూపిస్తోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
ధోనీ, కోహ్లీ, సెహ్వాగ్ విలాసవంతమైన ఇళ్లు చూస్తే మైండ్ బ్లాకే

కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర