Video Viral: బిడ్డ కోసం తల్లి ఏనుగు ఆరాటం.. ప్రాణాలకు తెగించి ప్రకృతికి ఎదురెళ్లింది.. 

|

Jun 26, 2022 | 1:09 PM

తాజాగా ఓ ఏనుగు తన బిడ్డ కోసం పెద్ద సాహసం చేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Video Viral: బిడ్డ కోసం తల్లి ఏనుగు ఆరాటం.. ప్రాణాలకు తెగించి ప్రకృతికి ఎదురెళ్లింది.. 
Viral Video
Follow us on

సృష్టిలో తల్లి ప్రేమ అపరిమితం… అమ్మ ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు.. తన పిల్లల కోసం తల్లి పడే ఆరాటం వర్ణణాతీతం. పిల్లల ప్రాణాలకు ముప్పు వస్తే తన ప్రాణాలను అడ్డుపెడుతుంది.. కేవలం మనుషులు మాత్రమే కాదు.. మూగజీవులు సైతం తమ పిల్లల పై అమితమైన ప్రేమను చూపిస్తాయి. జంతువులు తమ పిల్లల కోసం మరో బలమైన జంతువుతో పోరాడుతాయి.. ఇందుకు సంబంధించి వీడియోస్ నెట్టింట వైరల్ అనేకం.. తాజాగా ఓ ఏనుగు తన బిడ్డ కోసం పెద్ద సాహసం చేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అందులో ప్రవాహ వేగంతో ఓ నది ప్రవహిస్తోంది.. అదే సమంయలో ఓ ఏనుగుల గుంపు నది దాటి అవతల ఉన్న అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి… అందులో చిన్న ఏనుగు పిల్లలు కూడా ఉన్నాయి.. అయితే ఓ చిన్న ఏనుగుకు నది దాటడం చాలా కష్టంగా మారింది. పెద్ద ఏనుగులు నది దాటిన చిన్న ఏనుగు పిల్ల దాటలేకపోయింది.. దీంతో నది ప్రవాహంలో ఏనుగు పిల్ల కొట్టుకుపోతుంది. అదే సమయంలో వెంటనే తన ప్రాణాలకు తెగించి మరి నదిలోకి వెళ్లి బిడ్డ కొట్టుకుపోకుండా అడ్డుగా నిలబడింది తల్లి ఏనుగు.. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మెల్లగా రెండు ఒడ్డుకు చేరి.. అడవిలోకి వెళ్లిపోయాయి.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.