అరుదైన దృశ్యం.. ఒకే చోట హిందూ ముస్లిం సామూహిక వివాహాలు! ఎక్కడంటే..?

Updated on: Sep 10, 2025 | 4:46 PM

కర్ణాటకలోని గడగ్‌లో 36 హిందూ-ముస్లిం జంటలు సామూహిక వివాహం చేసుకున్నారు. బెటగేరి అంజుమన్ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. పేదలకు వివాహ ఖర్చు భారం తగ్గించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ వివాహ వేడుక మత సామరస్యానికి నిదర్శనం గా నిలిచింది.

1 / 5
పండిట్ పుట్టరాజ్ గవై నడిచిన భూమిపై అరుదైన సంఘటన చోటు చేసుకుంది. హిందూ ముస్లింల సామూహిక వివాహాలు ఒకే చోట జరిగాయి. 36 మంది నూతన వధూవరులు కొత్త వివాహ జీవితంలోకి ప్రవేశించారు. కొన్ని చోట్ల మత విధ్వేషాలు రగులుతుంటే.. ఈ ప్రాంతంలో మాత్రం ఇలాంటి మతసామరస్యాన్ని చాటే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

2 / 5
కర్ణాటకలోని గడగ్ నగరంలోని అంజుమన్ స్కూల్ ప్రాంగణంలో హిందూ, ముస్లిం జంటల సామూహిక వివాహం ఘనంగా జరిగింది. బెటగేరి అంజుమన్ కమిటీ ఒక సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో 36 జంటలు కొత్త జీవితంలోకి ప్రవేశించారు. 26 హిందూ జంటలు, 10 ముస్లిం జంటలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

3 / 5
ఈ సందర్భంగా పుట్టరాజ్ గవైగల మఠం ప్రధాన పూజారి కల్లయ్యజ్జన్ మాట్లాడుతూ.. నేటి ఖరీదైన ప్రపంచంలో వివాహాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, పేదలకు వివాహం చేయడం చాలా కష్టమైన పని అని, అయితే బెటగేరి అంజుమన్ కమిటీ అన్ని మతాల కోసం సామూహిక వివాహ వేడుకను నిర్వహించిందని అన్నారు.

4 / 5
బేటగేరి అంజుమన్ కమిటీ నూతన వధూవరులకు తాళి, పట్టుబట్టలు బట్టలు పంపిణీ చేసింది. కమిటీ అధ్యక్షుడు పీరాసాబ్ కౌతల్, అతని భార్య నూతన వధూవరులకు తాళి అందించారు. వివాహానికి హాజరైన 6-7 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.

5 / 5
10 ముస్లిం జంటలు వారి సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోగా, 26 హిందూ జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. పుట్టరాజ్ గవైగల్ మఠం ప్రధాన పూజారి కల్లయ్యజ్జన్, ముస్లిం మత పెద్దల సమక్షంలో హిందూ-ముస్లిం సామూహిక వివాహ కార్యక్రమం జరిగింది.